కూతురుని రెడీ చేస్తున్న రోజా… అన్షుకి అంత మేటర్ ఉందంటారా అంటున్న సినీ జనం?

అవును… మినిష్టర్ రోజా తన కూతురుని రెడీ చేస్తోంది. దేనికని అనుకుంటున్నారా… దేనికని అంటారేంటండీ.. ఒక నటి కూతురు నటి కావాలనే అనుకుంటుంది మరి. అన్షు మాలిక సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఈమె కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో ట్రెయిన్ అవుతోంది. త్వరలో ఈమె హీరోయిన్‌గా నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

అన్షు ఒక సినీ వారసుడి చిత్రంతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఈమెతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ అగ్ర దర్శకులతో పాటు కోలీవుడ్ దర్శకులు సైతం రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని సంప్రదిస్తున్నారట. అన్షు మాలికకు తన తల్లి రోజా నుంచి ఇప్పటికే నటనలో టిప్స్ కూడా నేర్చుకుందట. అటు తండ్రి నుంచి కూడా కొన్ని మెలకువలు నేర్చుకుందంట. అయితే రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక.. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తుందా.. తండ్రికి సెల్వమణికి సంబంధించిన తమిళ భాషతో ఎంట్రీ ఇస్తుందా అనేది వేచి చూడాలి.

ఇప్పటికే ఆమె అమెరికాకు చెందిన ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సీటు సంపాదించిందట. త్వరలో అక్కడ నటనతో పాటు డైరెక్షన్, స్క్రీన్ ప్లే‌లో శిక్షణ తీసుకోబోతుందని సమాచారం. ఇక నటిగా రోజా విషయానికొస్తే.. తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగు ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. సర్పయాగం సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చిరుతో నటించిన ‘ముఠా మేస్త్రీ’తో పాటు బాలయ్యతో నటించిన ‘భైరవ ద్వీపం’తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Share post:

Latest