లైగర్ సినిమాకి వారు భారీగా పారితోషకం తీసుకున్నారు… ఇపుడు కొంతైన తిరిగి ఇచ్చేస్తారా?

పాన్ ఇండియా తెలుగు సినిమా లైగర్ హడావుడి మొన్నటితో ముగిసిపోయింది. సినిమా హిట్టైయుంటే హడావుడి కాస్త కొనసాగేది. కానీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఒక్కరోజుతోనే కథ సుఖాంతం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్లు , ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం కథాంశం పరంగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఇందులో విజయ్ దేవరకొండ నటన చాలా బాగుందని అంటూ కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్య అతిథి పాత్రలో ప్రముఖ దిగ్గజ బాక్సర్ మైకటైసన్ నటించిన సంగతి విదితమే. ఇక విజయ్ దేవరకొండ పాత్రకు తల్లి పాత్రలో అలనాటి స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించింది. ఇక హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించినది. ఇకపోతే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటీనటుల పారితోషకం ఎంత అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వీరి పారితోషకం ప్రస్తుతం తగ్గించు తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లైగర్ సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండ 35 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకున్నాడు అని సమాచారం. అలాగే హీరోయిన్ అనన్య పాండే 3 కోట్ల రూపాయలను, రమ్యకృష్ణ 2 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇక రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు, మైక్ టైసన్ కేవలం 3 రోజుల షూటింగ్ కోసం ఆయన ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నారు అంటూ బయట వదంతులు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ న్యూస్ తెలిసినవారు కాస్త వారి వారి పారితోషికాన్ని తగ్గించుకొని పూరీకి మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Share post:

Latest