లేడీ ఎమ్మెల్యేలని జగనే కాపాడాలి?

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన సొంత ఇమేజ్ ఉండాలి..సొంత ఇమేజ్ ఉంటేనే రాజకీయంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి .సొంత ఇమేజ్ లేకుండా రాజకీయాల్లో విజయం సాధించడం అనేది చాలా కష్టం. ఏదో పార్టీ బట్టి అయితే…పార్టీ గాలి ఉన్నప్పుడు గెలుస్తారు…లేకపోతే ఓడిపోతారు. అలా కాకుండా సొంత బలం అంటూ ఉంటే…పార్టీ గాలి లేనప్పుడు కూడా గెలవచ్చు.

అయితే గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ గాలిలోనే గెలిచారని చెప్పొచ్చు. జగన్ ఇమేజ్ వల్ల కొందరు ఎమ్మెల్యేలుగా నెగ్గగలిగారు. ముఖ్యంగా లేడీ ఎమ్మెల్యేలు. దాదాపు లేడీ ఎమ్మెల్యేలంతా జగన్ వేవ్ లోనే గెలిచారు. ఏదో కొందరు తప్ప మిగతా వారంతా జగన్ ఇమేజ్ తో గెలిచారు…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవగలుతారా? అంటే నెక్స్ట్ వైసీపీ వేవ్ అంతగా ఉండకపోవచ్చు. ఏదో కొద్దో గొప్పో ఉంటే…అది సొంత ఇమేజ్ ఉన్న వారే గెలవగలుగుతారు.

అలాంటి ఎమ్మెల్యేలని మళ్ళీ జగనే కాపాడాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ తో పాటు సొంత బలంతో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు రోజా, సుచరిత, వనిత, కళావతి, పుష్పశ్రీ వాణి లాంటి వారు ఉన్నారు. ఇక తొలిసారి పోటీ చేసిన వారంతా జగన్ వేవ్లోనే గెలిచారు. ధనలక్ష్మీ, భాగ్యలక్ష్మీ, రెడ్డి శాంతి, ఉషశ్రీ చరణ్, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని, కంగాటి శ్రీదేవి, జొన్నలగడ్డ పద్మావతి ఇలా కొందరు ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్ తో గెలిచారు. అయితే వీరిలో ఒకరిద్దరు మాత్రమే సొంత బలం పెంచుకున్నారు.

ఉదాహరణకు రజిని…తొలిసారి గెలిచినా సరే సొంత ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అటు పద్మావతి సైతం సొంత బలం పెంచుకున్నారు. ఇలాంటి వారికి ఇబ్బంది లేదు గాని..మిగిలిన ఎమ్మెల్యేలని జగనే మళ్ళీ కాపాడాల్సి ఉంటుంది. ఈ సారి గాని జగన్ వేవ్ తగ్గితే…ఆ ఎమ్మెల్యేల గెలుపు కూడా కష్టమే.

Share post:

Latest