సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో జగన్ సమావేశమవుతున్నారు.

- Advertisement -

వారితో సమావేశమవుతూ…నియోజకవర్గాల్లో పరిస్తితులని తెలుసుకుంటూ…ఇంకా బెటర్ గా పనిచేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో జగన్..అసెంబ్లీ సీట్లని కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. ఇటీవల కుప్పం కార్యకర్తలతో జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెక్స్ట్ భరత్ కుప్పం బరిలో ఉంటారని, ఆయన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

అలాగే తాజాగా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంచి మార్పు తెచ్చామని.. 30 ఏళ్లూ అధికారంలో ఉంటామని వారితో చెప్పి…నెక్స్ట్ కంబాల జోగులుని మళ్ళీ గెలిపించాలని కార్యకర్తలతో అన్నారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో జోగులు…రాజాం నుంచి గెలుస్తూ వచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా రాజాం నుంచి ఆయనే పోటీ చేస్తారని జగన్ ఫిక్స్ చేసేశారు.

అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి రాజాంలో జోగులు గెలుపు అంత ఈజీ కాదని తేలుస్తోంది. మరి అలాంటప్పుడు జగన్…మళ్ళీ రాజాం సీటు జోగులుకే ఫిక్స్ చేశారు. అలాగే ఇకపై ఇతర నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ అవ్వనున్నారు…అప్పుడు వరుసపెట్టి సీట్లు ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజారిటీ సీట్లు ఈ సమావేశాల్లోనే తేల్చేలా ఉన్నారు. ఎన్నికల ముందు వరకు సాగనివ్వకుండా, ముందే అభ్యర్ధులని ప్రకటించడం బెనిఫిట్ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కార్యకర్తలతో సమావేశమవుతూనే…అభ్యర్ధులని కూడా డిక్లేర్ చేస్తున్నారు.

Share post:

Popular