మన్యంలో మళ్ళీ స్వీప్..అదే డౌట్?

ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి ఏ స్థాయి బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెన్సీలో ఉండే గిరిజన ప్రజలు ఎక్కువ జగన్ అంటే అభిమానంతో ఉంటారు. అందుకే ఆయా ఏజెన్సీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాలని పూర్తిగా వైసీపీ గెలుచుకుంది…ఇప్పటికీ ఆయా స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వైసీపీకి ఇబ్బంది తెచ్చే పెట్టేలా ఉంది. అయితే స్థానిక ప్రజలు జగన్ బొమ్మ చూసే ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఏజెన్సీల్లో వైసీపీ హవా నడవచ్చు.

అలా వైసీపీ హవా మళ్ళీ మన్యం జిల్లాలో ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది..ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే అసలు డౌట్ వచ్చి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత…కొద్దోగొప్పో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరపై తప్ప…మిగిలిన మూడు స్థానాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత గట్టిగానే కనిపిస్తోంది.

కురుపాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణికి అంత అనుకూలమైన వాతావరణం లేదు. వరుసగా రెండు సార్లు గెలిచిన పుష్పశ్రీ వల్ల కురుపాంకు పెద్దగా ఒరిగింది కూడా ఏమి లేదు. అక్కడ ఆమెపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. పార్వతీపురంలో అలజంగి జోగారావు పరిస్తితి కూడా అంతే…పైగా ఇక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయి. జమ్మన ప్రసన్న కుమార్ సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. ఇలా గ్రూపు రాజకీయాలు పార్వతీపురంలో వైసీపీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి.

ఇక గత రెండు ఎన్నికల్లో పాలకొండ నుంచి గెలుస్తున్న కళావతి పరిస్తితి కూడా ఈ సారి అంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే మన్యం జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్తితి బాగోలేదు…కానీ జనం ఎమ్మెల్యేలని కాకుండా జగన్‌ని చూసి ఓటు వేస్తే మళ్ళీ మన్యంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయొచ్చు. లేదంటే వైసీపీకి ఇబ్బందే.