కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!

అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి.

ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు…బాబు భయంతో కుప్పం పరిగెడుతున్నారని అంటున్నారు. అయితే సెటైర్లు వేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పాలి…వరుసగా విజయాలు సాధించిన బాబు కాస్త భయపడి వెనక్కి తగ్గి…కుప్పంలో పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్తితులని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు.

అలాగే అక్కడ ఎవరు టీడీపీ కోసం పనిచేస్తున్నారో,  ఎవరు పరోక్షంగా వైసీపీకి సహకరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల బాబుకే అడ్వాంటేజ్ అవుతుంది…భవిష్యత్ లో మరొకసారి తప్పులు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం వరుసగా విజయాలు దక్కాయి కదా…ఇంకా తమకు తిరుగులేదనే భావనలోనే ఉన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ బాబునే వణికించామని, దెబ్బకు కుప్పం పరిగెత్తేలా చేశామని చెప్పుకుంటున్నారు.

నిజానికి వైసీపీ నేతలు బాబుకు మంచి చేస్తున్నారని చెప్పొచ్చు…ఎందుకంటే బాబు ఇప్పుడు అలెర్ట్ కాకపోతే..రేపు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటారు…ఇప్పుడు బాబు అలెర్ట్ అయ్యేలా చేసి..కుప్పంపై ఫోకస్ చేసేలా చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం గెలిచేశాం కదా…ఇంకేముందిలే అనే ధీమాలో ఉన్నారు. దీని వల్ల కుప్పంలో వైసీపీకే నష్టం జరిగేలా ఉంది.

ఇప్పటికే భరత్‌ని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు…అలాగే ఆయన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఇక ఈ హామీ జగన్ నెరవేర్చడం పక్కన పెడితే…భరత్ గెలిస్తే మంత్రి అవుతారేమో గాని..బాబు గెలిస్తే సీఎం అవుతారు. కాబట్టి ప్రజలు ఏ ఆప్షన్ ఎక్కువ ఎంచుకుంటారో చెప్పాల్సిన పని లేదు. ఏదేమైనా కుప్పంలో ముందు జాగ్రత్త పడేలా చేసి…వైసీపీ బాబుకు మేలే చేసింది.

Share post:

Latest