విశాఖలో సిట్టింగులకు మళ్ళీ ఛాన్స్?

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని ఇప్పటికే సీఎం జగన్ తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే…అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని తెలుస్తోంది…అలాగే వారిపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువ ఉందని, నెక్స్ట్ మళ్ళీ వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టమని పీకే టీం సర్వేలో తేలిందని సమాచారం. దీని బట్టి చూసుకునే…ఆరు నెలల్లో పనితీరు మెరుగుపరుచుకోకపోతే…నెక్స్ట్ మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు.

అయితే ఆరు నెలల్లో ఎంతమంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగు అవుతుందో చెప్పలేని పరిస్తితి…ఒకసారి వ్యతిరేకత తెచ్చుకున్నాక…దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి…ఈ సారి కొందరు సిట్టింగులకు సీటు దక్కడం మాత్రం కష్టమనే చెప్పొచ్చు…ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు దొరుకుతాయా? అంటే ఇద్దరు, ముగ్గురుకు తప్ప మిగిలిన వారికి సీట్లు దాదాపు ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది.

గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 15 సీట్లలో 11 సీట్లు వైసీపీ గెలుచుకుంది..టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో వైసీపీ బలం 12 సీట్లకు పెరిగింది. అయితే 12 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు దక్కే అవకాశాలు కొంతమందికే కనిపిస్తున్నాయి. భీమిలిలో అవంతి శ్రీనివాస్, చోడవరంలో కరణం ధర్మశ్రీ, పాయకరావుపేటలో గొల్ల బాబూరావు, నర్సీపట్నంలో గణేశ్, మాడుగులలో ముత్యాలనాయుడు, అనకాపల్లిలో అమర్నాథ్ పోటీ దాదాపు ఖాయమని తెలుస్తోంది.

అరకులో ఫాల్గుణ మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే పాడేరులో భాగ్యలక్ష్మి పోటీ విషయంలో క్లారిటీ రావడం లేదు. అలాగే గాజువాకలో నాగిరెడ్డి, ఎలమంచిలిలో కన్నబాబురాజుకు సీటు ఫిక్స్ చేస్తారో లేదో చెప్పలేని పరిస్తితి. అటు పెందుర్తిలో అదీప్ రాజ్ కు పోటీగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేశ్..విశాఖ సౌత్ లో వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమే.