మైదుకూరు: శెట్టిపల్లికి నో ఛాన్స్?

కడప జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఈ జిల్లాలో వైసీపీకి తప్ప టీడీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో జిల్లాల్లోని 10 సీట్లని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే..అలా జిల్లా మొత్తం స్ట్రాంగ్ గా ఉండే వైసీపీకి ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితులు వస్తున్నాయి. నిదానంగా కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతుంది…వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగా కలిసొస్తుంది.

ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కడపలో రెండు, మూడు సీట్లు టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అసలు అన్నీ సీట్లు వైసీపీ ఖాతాలో పడాల్సిన జిల్లాలో ఇలా టీడీపీ రెండు, మూడు సీట్లు గెలిచిన వైసీపీకే ఇబ్బంది. అందుకే టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే పనితీరు బాగోని ఎమ్మెల్యేలని పక్కన పెట్టేస్తానని చెప్పేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని చెప్పారు.

ఇదే క్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి సైతం సీటు దక్కడం కష్టమే అని తెలుస్తోంది.  కడప జిల్లా రాజకీయాల్లో ఎంతో సీనియర్ నేత అయిన…శెట్టిపల్లి గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డీఎల్ రవీంద్రా రెడ్డి లాంటి బడా నేతకు చెక్ పెట్టారు. ఇక తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా శెట్టిపల్లి వైసీపీలో చేరి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు.

అయితే రెండుసార్లు గెలిచిన మైదుకూరులో పెద్ద మార్పు లేదు…అలాగే ఆయన యాక్టివ్ గా తిరగలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా మైదుకూరులో టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అసలు మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ పై చేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ శెట్టిపల్లికి సీటు దక్కడం కష్టమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి కడపలో క్లీన్ స్వీప్ చేయడానికి వైసీపీలో పలు మార్పులు జరిగేలా ఉన్నాయి.

Share post:

Latest