అచ్చెన్న ప్రత్యర్ధి మళ్ళీ మారతారా?

ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు…ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న చాలా స్ట్రాంగ్ నాయకుడు…రాష్ట్ర స్థాయిలో పేరున్న నేత…వరుసగా టెక్కలిలో సత్తా చాటుతున్న నేత…ఇలాంటి నేతకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఈజీగా అచ్చెన్నకు ఓడించడం సులువు కాదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలా టీడీపీలో బలంగా ఉన్న నాయకులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది.

అలాగే టెక్కలిలో అచ్చెన్నని ఎలాగైనా ఓడించాలని వైసీపీ ట్రై చేస్తుంది. గత రెండు ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ గెలవడం లేదు…అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014 ఎన్నికల్లో అచ్చెన్నపై దువ్వాడ శ్రీనివాస్‌ని నిలబెట్టారు. కానీ గెలుపు అచ్చెన్నకు దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో అచ్చెన్నపై అభ్యర్ధిని మార్చారు. దువ్వాడని శ్రీకాకుళం ఎంపీగా నిలబెట్టి…టెక్కలిలో పేరాడ తిలక్‌ని నిలబెట్టారు.

అటు రామ్మోహన్‌పై దువ్వాడ ఓడిపోగా, ఇటు అచ్చెన్నపై తిలక్ ఓడిపోయారు. అయితే వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక దువ్వాడకు మంచి అవకాశాలు వచ్చాయి…ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది..అలాగే టెక్కలి ఇంచార్జ్ పదవి వచ్చింది. టెక్కలి ఇంచార్జ్ పదవి వచ్చాక దువ్వాడ మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. టెక్కలిలో అచ్చెన్నకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

అయితే రాజకీయంగా ముందుకెళితే పర్లేదు…కానీ దువ్వాడ …వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే ప్రత్యర్ధులని పరుష పదజాలంతో తిడుతున్నారు. ఎంతకష్టపడిన…ఇలా బూతులు మాట్లాడటమే దువ్వాడకు మైనస్ అయింది…పైగా తిలక్‌ వర్గాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో టెక్కలిలో దువ్వాడకు ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ టెక్కలిలో అచ్చెన్నకు చెక్ పెట్టడం కష్టమని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవల పీకే టీం సర్వేలో టెక్కలిలో అభ్యర్ధిని మార్చాలనే రిపోర్ట్ జగన్‌కు చేరినట్లు తెలిసింది. అయితే జగన్ సన్నిహితుడుగా ఉన్న దువ్వాడని మార్చడం అంత ఈజీ కాదు. మరి టెక్కలిలో గెలవాలంటే మార్పు జరగాలి. మళ్ళీ దువ్వాడని శ్రీకాకుళం పార్లమెంట్‌లో నిలబెట్టి..టెక్కలిలో మరో బలమైన అభ్యర్ధిని నిలబెడతారేమో చూడాలి.

Share post:

Latest