ఏపీలో వినాయ‌క చ‌వితి రాజ‌కీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?

అత్యంత సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటే.. అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపిస్తుం ద‌నే వాద‌న ఉంటుంది కాబ‌ట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్ర‌భుత్వానికి ఎవ‌రు స‌ల‌హాలు ఇస్తున్నారో.. ఎవ‌రు ఏం చెబుతున్నారో.. తెలియ‌దు కానీ.. కీల‌క‌మైన హిందూ సామాజిక వ‌ర్గం విష‌యంలోప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదానికి కార‌ణంగా మారుతున్నాయి.

Tribunal stays AP government notice to Greenko

మ‌రో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి వేడుక‌లు ప్రారంభం అవుతున్నాయి. దాదాపు రెండు సంవ‌త్స‌రాల క‌రోనా ఎఫెక్ట్ త‌ర్వాత‌.. ప్ర‌జ‌లంతా.. కూడా ఈ వేడుక‌ల‌ను ఆర్భాటంగా చేసుకునేం దుకు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే యువ‌త పందిళ్లు వేసుకునేందుకు.. ప్ర‌య‌త్నాలు చేస్తు న్నాయి. అయితే.. ఈ విష‌యంలోనే స‌ర్కారు నుంచి అనేక ఆంక్ష‌లు.. ఆదేశాలు వ‌స్తుండ‌డం.. యువ‌త ను తీవ్ర‌స్థాయిలో బాధ‌పెడుతోంది.

Ganesh Chaturthi 2022 - Calendar Date

పందిళ్లు వేస్తే..ప‌ర్మిష‌న్లు అనేది… స‌హ‌జ‌మే. ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనే చేసిందే.. చేసేదే. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. అయితే.. మ‌న రాష్ట్రంలోనూ.. గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వం కూడా అనుమతులు తీసుకుని పందిళ్లు వేసుకునేందుకు ఆస్కారం క‌ల్పించింది. ఎందుకంటే.. మ‌న రాష్ట్రంలో ఎక్క‌డా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లుజ‌రిగింది కానీ.. అలాంటి ఛాయ‌లు కానీ లేక‌పోవ‌డ‌మే కార‌ణం. అయితే.. ఇప్పుడు చిత్రంగా వైసీపీ ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌లు అంద‌రినీవిస్మ‌యానికి గురి చేస్తున్నాయి.

Manvitha (𝕾𝖚𝖒𝖆) on Twitter: "The Tri Colour of YSRCP resembles 😍😍 Blue - For Youth saying the sky is the limit for their achievements White - Peace, Good Governance and Coordination Green -

పందిళ్లు వేసుకునే వారి నుంచి రిజిస్ట్రేష‌న్ ఫీజులు వ‌సూలు చేయాల‌ని.. స‌ర్కారు నిర్ణ‌యించింది. అది కూడా.. సెంట‌ర్‌.. పందిరి సైజును బ‌ట్టి.. రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు నిర్ణ‌యించ‌డం.. తీవ్ర వివాదానికి దారితీస్తోంది. పైగా.. సీఎం పొటోలు పెట్టాల‌ని కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు.. ఆదేశాలు ఇస్తున్నారు. ఇది కూడా తీవ్ర వివాదానికి దారితీస్తోంది. దేవుడి కోసం వేస్తున్న పందిళ్ల‌లో .. సీఎం ఫొటోలు పెట్ట‌డం.. రిజిస్ట్రేష‌న్ ఫీజులు వ‌సూలు చేయ‌డం అనేది ఎక్క‌డా లేదు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఇలాంటి నిర్ణ‌యాలు వెనక్కి తీసుకుంటే మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Latest