మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బోళా శంకర్ సినిమా వచ్చేది అప్పుడే..!!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో చాలా జోరు పెంచారు.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరోగా మారిపోయారు. ఇక ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ భారీ డిజాస్టర్ ను చవిచూసిస్తుంది అయితే ఇక తన తదుపరి చిత్రాల పైన కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి మరింత ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న చిత్రాలలో గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేర్ వీరయ్య వంటి చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.Bhola Shankar first look poster featuring Chiranjeevi is out- Cinema express

ఇక చిరంజీవి పుట్టినరోజు రేపు కనుక ఆయనకు సంబంధించిన సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కూడా చాలా సంబరంగా చేసేందుకు అభిమానులు సైతం ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక చిరంజీవి కూడా తన పుట్టినరోజు సందర్భంగా సినీ కార్మికుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. తాజాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా బోళా శంకర్ చిత్రాన్ని రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది చిత్ర బృందం వాటి గురించి చూద్దాం.Chiranjeevi's Bhola Shankar Movie: Tamannaah Bhatia to play leading lady  opposite Chiranjeevi in Meher Ramesh's film?

బోళా శంకర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక పోస్టర్ విషయానికి వస్తే చిరంజీవి చేతిలో త్రిశూలం లాకెట్ ఉన్న చైన్ తిప్పుతూ చాలా కూలింగ్ గా కనిపిస్తూ ఉన్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా కీర్తి సురేష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వేదాళం చిత్రాన్ని రీమిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారుతోంది.

https://twitter.com/AKentsOfficial/status/1561252037232209922?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1561252037232209922%7Ctwgr%5E9d5132c8154984a229072d9f5e369ca3256f13bf%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fmegastar-chiranjeevi-birthday-special-bhola-shankar-movie-release-on-2023-april-14th-megastar-chiranjeevi-new-look-reveal-au55-768290.html