కుప్పంతోనే మొదలు..జగన్ వదలరు..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే…కుప్పంలో పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటమని, అంటే కుప్పంలోనే గెలిచినప్పుడు…ఇంకా 175కి 175 సీట్లు గెలిచేయొచ్చని జగన్…ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునేటప్పుడు కుప్పంని ఉదాహరణగా చెప్పి..175 సీట్లు ఎందుకు గెలవకూడదో చెప్పాలని ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్ దృష్టి కుప్పంపై ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు.

దశాబ్దాల కాలంగా కుప్పంలో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం టార్గెట్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టారు. అక్కడున్న టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. అలాగే పంచాయితీలో ఏకపక్షంగా గెలిచేశారు. అటు పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటారు. ఇక కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం గెలిచేలా ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్..ఇక పై అన్నీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో మాట్లాడి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్తితిని తెలుసుకోనున్నారు. ఈ విషయంలో మొదటగా కుప్పం నుంచే జగన్ స్టార్ట్ చేయనున్నారు…కుప్పంలోని 50 మంది వైసీపీ కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఈ 50 మంది కార్యకర్తలని ప్రశాంత్ కిషోర్ టీం ఎంపిక చేసిందని తెలుస్తోంది. పాత, కొత్త కార్యకర్తలని కలిపి 50 మందిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ నెల 4న..ఆ 50 మందితో జగన్ మాట్లాడనున్నారు. కుప్పంలో ప్రస్తుతం రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయి…ఇంకా వైసీపీ బలోపేతానికి ఏం చేయాలనే అంశాలపై జగన్ చర్చించనున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో కుప్పంని సైతం కైవసం చేసుకునేలా జగన్..కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే జగన్…కుప్పం వదిలేలా లేరు.