జగన్ కొత్త ప్లాన్..కలిసొస్తుందా?

ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…పైకి 175 టార్గెట్ పెట్టుకున్నారు గాని…కనీసం 100 సీట్లు పైనే గెలిచి అధికారంలోకి వస్తే చాలు అనే భావన జగన్‌లో ఎక్కువ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం. అసలు కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు చూస్తుంటే…అసలు 175 సంగతి పక్కన పెడితే…కనీసం అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు వస్తాయా? అనేది డౌట్ అయిపోయింది.

ఎందుకంటే టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తే ఏదొకవిధంగా వైసీపీకే మళ్ళీ అధికారం దక్కవచ్చు..కానీ టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి అధికారంలోకి రావడం కష్టమవుతుంది. ఆ విషయం జగన్‌కు కూడా బాగా తెలుసు…అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే జగన్…జనంలోకి వచ్చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలని గడప గడపకు పంపించారు. అయితే గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్యేలకు ఎక్కువగా ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి.

సంక్షేమ పథకాలు సరే అభివృద్ధి ఏది అని…రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్‌లు…అలాగే పెరిగిన పన్నుల భారంపై ప్రజలు ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళడం లేదు. అయితే ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది అని గ్రహించి జగన్ సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చారు. ఇక నుంచి అధికారులు కూడా జనంలో తిరగాలని ఆదేశించారు. కలెక్టర్లతో పాటు అన్నీ శాఖల అధికారులు ప్రజల్లో తిరగాలని చెప్పారు. దీని వల్ల ఇంకా తమ గ్రాఫ్ పెరుగుతుందనేది జగన్ ఆలోచనగా ఉంది.

అయితే ఈ ప్లాన్ వల్ల బెనిఫిట్ ఉంటుంది…అధికారులు ప్రజల్లోకి వెళితే..ఇంకా సమస్యల పరిష్కారం త్వరగా అవుతుంది…అదే సమయంలో దీని వల్ల నష్టం కూడా ఉంది..ఇప్పటికే వాలంటీర్లని పెట్టి తమని ప్రజలకు దూరం చేశారని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు…ఇప్పుడు అధికారులు కూడా ప్రజల్లోకి వస్తే ఇంకా తాము చేసేది ఏం ఉంటుందని, ప్రజలు తమని ఎందుకు చూస్తారనే డౌట్లు ఎమ్మెల్యేలు రైజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూడాలి జగన్ కొత్త ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Share post:

Latest