బీజేపీతో బాబు..జగన్ సేఫ్?

ఎట్టకేలకు చంద్రబాబు…బీజేపీకి దగ్గరయ్యే మార్గం సుగమమైంది..ఇంతకాలం బీజేపీకి చేరువ కావాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా ఉన్నాయి. తాజాగా ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో పాల్గొన్న బాబుకు…మోదీ, అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులని కలుసుకునే అవకాశం వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత బాబు…మోదీని కలవడం ఇప్పుడే.

అయితే కేంద్రం సపోర్ట్ ఉంటే…నెక్స్ట్ ఎన్నికల్లో తమకు బెనిఫిట్ అవుతుందని బాబు భావిస్తున్నారు…సపోర్ట్ లేకపోతే ఏమవుతుందో గత ఎన్నికలు నిరూపించాయి. అందుకే అప్పటినుంచి కేంద్రం సపోర్ట్ కోసం బాబు తిరుగుతూనే ఉన్నారు…తాజాగా బీజేపీ పెద్దలని కలుసుకున్నారు. కాకపోతే వారి మద్ధతు పూర్తి స్థాయిలో దొరుకుతుందా? లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

కానీ ఏపీలో బాబు అధికారంలోకి రావాలంటే బీజేపీ సపోర్ట్ ఎంతైనా కావాలి. అటు ఏపీలో బీజేపీ నాలుగైదు సీట్లు గెలుచుకోవాలంటే టీడీపీ మద్ధతు కావాలి. ఈ పరిణామాల నేపత్యంలోనే బాబుకు బీజేపీ దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో జగన్ సైతం…కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు…2019లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్..కేంద్రం పెద్దలతో ఏ మాత్రం కయ్యం పెట్టుకోకుండా…పరోక్షంగా వారి మద్ధతు తీసుకుంటేనే..జగన్ సైతం అవసరమైనప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో బీజేపీకి బాబు దగ్గరవ్వడం వల్ల…జగన్ కు ఏమన్నా రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎన్నికల సమయంలో కేంద్రం సపోర్ట్ ఉంటేనే బెటర్ అని చెప్పొచ్చు. ఒకవేళ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే…జగన్ కు కాస్త నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో జగన్ కు ఒక బెనిఫిట్ కూడా ఉంది.

అది ఏంటంటే…రాష్ట్రానికి ఎలాగో బీజేపీ చేసింది ఏమి లేదు..ఈ అంశంలో బీజేపీపై జనం ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసొస్తున్నాయని..తాను ఒంటరిని అని జగన్ సెంటిమెంట్ లేపొచ్చు. మరి ఫ్యూచర్ లో బీజేపీకి బాబూకు దగ్గరైతే జగన్ నష్టం జరుగుతుందో…లాభం ఉంటుందో చూడాలి.

Share post:

Latest