సర్వేలు వచ్చిన బాబు పట్టించుకోవట్లేదే!

ఇటీవల పలు నేషనల్ సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జాతీయ మీడియా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం…వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6, ఇండియా టుడే సర్వే ప్రకారం…వైసీపీకి 18, టీడీపీకి 7, టైమ్స్ నౌ ప్రకారం…వైసీపీ 17-23 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది.

ఓవరాల్ గా చూస్తుంటే వైసీపీనే మళ్ళీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తేలింది. గత ఎన్నికల్లోనే 25కి 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంది..టీడీపీ కేవలం 3 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు కొద్దిగానే పరిస్తితి మారింది తప్ప…పూర్తిగా టీడీపీ పుంజుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడున్న వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం పెద్దగా పోరాడిన సందర్భాలు తక్కువ.

పైగా లోక్‌సభలో ఏదో ముగ్గురు, నలుగురే హైలైట్ అవుతారు…అటు ప్రత్యేక హోదా ఎలాగో పోయింది…విభజన హామీలు అమలు చేసుకోవడంలో వైసీపీ ఎంపీలు విఫలమవుతున్నారు. అంటే ఎంపీల పనితీరు పెద్దగా బాగోలేదు…అయినా సరే ప్రజలు…వైసీపీ వైపే ఉన్నారంటే..దానికి కారణం జగన్ ఇమేజ్..అదే సమయంలో పనితీరు బాగోని ఎంపీలని జగన్ మార్చేయాలని చూస్తున్నారు.

అయితే వైసీపీ ఎంపీలపై ఉన్న వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ విఫలమవుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో టీడీపీకి అభ్యర్ధులు లేరు. ఇప్పుడు కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని పెట్టాలని బాబు చూస్తున్నారు. అలా చేస్తే పార్టీకే డ్యామేజ్. కాబట్టి ఇప్పటినుంచే అభర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తే పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పటికే అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప లాంటి స్థానాల్లో టీడీపీకి క్యాండిడేట్లు లేరు. సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్న సర్వే బాబు మేలుకోకుండా ఇంకా పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ చేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ నష్టపోవాల్సిందే.

Share post:

Latest