సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 13 సెల‌వులు… ముందే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

ఆగస్టు నెల చివరి దశలో ఉంది. త్వ‌ర‌లో స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. ఇవేవో బంధు, సమ్మె కారణంగా వచ్చిన సెలవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవులు ఇవి. ఎక్కువగా లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వినియోగదారులకు సెప్టెంబర్ కొంచెం తలనొప్పిగానేే మారనుంది.

Bank Holidays in December 2021: Banks to be closed for 6 days in Telangana

ఇదే సందర్భంలో బ్యాంకులకు వచ్చిన సెలవులలో రెండు ఆదివారాలు , రెండు శనివారాలు ఉన్నాయి.
ఆర్బీఐ లెక్క‌ల ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌లో 8 రోజులు సెల‌వులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న అక్కడ ఆచారాలు సంస్కృతి పండుగ ప్రకారం మిగిలిన సెలవులు ఉన్నాయి.

సెప్టెంబర్లో బ్యాంకులకు వచ్చే సెలవులు :

-సెప్టెంబర్ 1న గణేష్ చతుర్థి (2వ రోజు)

-సెప్టెంబర్ 4న నెలలో మొదటి ఆదివారం కారణంగా సెల‌వు.

– సెప్టెంబర్ 6న కర్మ పూజ జరుపుకోవడానికి రాంచీలోని బ్యాంకుల‌కు సెల‌వు.

– సెప్టెంబర్ 7న మొదటి ఓనం నేప‌థ్యంలో కొచ్చి – తిరువనంతపురంలో బ్యాంకులు సెల‌వు.

-సెప్టెంబర్ 8న తిరువోణం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు సెల‌వు.

-సెప్టెంబర్ 9న ఇంద్రజాత‌ర‌ను పురస్కరించుకుని గాంగ్‌టక్ బ్యాంకులు సెల‌వు.

-సెప్టెంబర్ 10న రెండో ఆదివారం.

-సెప్టెంబర్ 18న మూడో ఆదివారం.

-సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా, కొచ్చి మరియు తిరువనంతపురంలో బ్యాంకులు సెల‌వు.

-సెప్టెంబర్ 24న నాలుగో శనివారం.

-సెప్టెంబర్ 25న నాల్గవ ఆదివారం.

-సెప్టెంబర్ 26న లైనింగ్‌ థౌ సనామహీకి చెందిన నవరాత్రి స్థాప్న/ మేరా చౌరెన్ హౌబా సందర్భంగా ఈ తేదీన ఇంఫాల్, జైపూర్‌లోని బ్యాంకులు సెల‌వు.