క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఆసియా కప్ 2022 లో ఆడే ప్రధాన టీంలైన భారత్-పాకిస్తాన్ -శ్రీలంక.. టీమ్ లో అనుకోని మార్పులు జరిగాయి. ఈ మూడు టీంలకు ఈ మార్పులు పెద్ద ఎదురు దెబ్బే..! ఈ మూడు టీంల లో ఉన్న కీ పేసర్ల సేవలను కోల్పోయాయి. టీం ఇండియాకు ఫాస్ట్ బౌలర్ బూమ్రా, పాకిస్తాన్ కు షాహిన్ అఫ్రిది, శ్రీలంకకు దుష్యంత్ సమీరా మ్యాచ్‌లు ఆడటం లేదు.
టీమ్ ఇండియాకు ఇంకొక కోలుకోలేని దెబ్బ తగిలింది. చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే హర్షత్ పటేల్ సైతం గాయాలతో ఆసియా కప్‌నకు దూరమయ్యారు. షాహిన్ ఆఫ్రీది స్థానంలో మహమ్మద్ హుస్సేన్ జట్టులోకి వచ్చాడు. తమ ప్రధాన ఫేస్ బౌలర్లు లేకపోవడంతో ఈ మూడు టీంలకుు ఆసియా కప్ లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి అని క్రికెట్ విశేషాలు కూడా చెబుతున్నారు.