దుబాయ్ వేదిక గా శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు భాగాలుగా చేసి నిర్వహించనున్నారు. ఇందులో ఆడే జట్లు భారత్- శ్రీలంక -పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తో పాటు హాంగ్‌కాంగ్ సైతం ఆడుతుంది.
గ్రూప్ ఎ లో భారత్- పాకిస్తాన్ -హాంకాంగ్ జట్లు ఉండగా. గ్రూప్ బిలో శ్రీలంక -ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఆసక్తిగి చూసిన ఆసియా కప్-2022 ఈవెంట్ పూర్తి వివరాలు మ్యాచులు జరిగే ప్రదేశాలు,మ్యాచ్ ప్రారంభ సమయం, ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? సంబంధించిన షెడ్యూల్ వచ్చింది.
ఆసియా కప్- 2022 షెడ్యూల్
1. ఆగష్టు 27- శనివారం- శ్రీలంక vs అఫ్గనిస్తాన్(గ్రూప్- బి)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
2. ఆగష్టు 28- ఆదివారం- ఇండియా vs పాకిస్తాన్(గ్రూప్- ఏ)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
3. ఆగష్టు 30- మంగళవారం- బంగ్లాదేశ్vs అఫ్గనిస్తాన్(గ్రూప్- బి)- షార్జా క్రికెట్ స్టేడియం
4. ఆగష్టు 31- బుధవారం- ఇండియా vs హాంకాంగ్(గ్రూప్-ఏ)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
5. సెప్టెంబరు 1- గురువారం- శ్రీలంక vs బంగ్లాదేశ్(గ్రూప్ బి)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
6. సెప్టెంబరు 2- శుక్రవారం- పాకిస్తాన్ vs హాంకాంగ్(గ్రూప్- ఏ)- షార్జా క్రికెట్ స్టేడియం- షార్జా
సూపర్ 4 స్టేజ్ మ్యాచ్‌లు- వేదిక- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
7. సెప్టెంబరు 3- శనివారం- గ్రూప్ బి టాపర్ వర్సెస్ గ్రూప్ బి సెకండ్ టాపర్
8. సెప్టెంబరు 4- ఆదివారం- గ్రూప్ ఏ టాపర్ వర్సెస్ గ్రూప్ ఏ సెకండ్ టాపర్
9. సెప్టెంబరు 6- మంగళవారం- గ్రూప్ ఏ టాపర్ వర్సెస్ గ్రూప్ బి టాపర్
10. సెప్టెంబరు 7- బుధవారం- గ్రూప్ ఏ సెకండ్ టాపర్ vs గ్రూప్ బి సెకండ్ టాపర్
11. సెప్టెంబరు 8- గురువారం- గ్రూప్ ఏ టాపర్ vs గ్రూప్ బి సెకండ్ టాపర్
12. సెప్టెంబరు 9- శుక్రవారం- గ్రూప్ బి టాపర్ vs గ్రూప్ ఏ సెకండ్ టాపర్
13. సెప్టెంబరు 11- ఫైనల్
మ్యాచ్ ఆరంభ సమయం
టీ20 ఫార్మాట్లో జరుగనున్న ఆసియా కప్ 15 ఎడిషన్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం
ప్రసార వేదికలు
స్టార్ స్పోర్ట్స్ చానెల్
లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‌స్టార్