అశ్వినీ దత్: ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యం!!

నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలోకి రాక ముందు ఎంతోమంది ఆర్టిస్టులు తెరమీదకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది తమదైన నటనతో ముద్ర వేసుకున్నారు. కానీ తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ కి ఉన్నంత స్థానం మరొక ఏ హీరోకి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన పరంగా.. భాషాపరంగా .. గ్లామర్ పరంగా హీరోయిన్ లు సైతం ఆయనతో పోటీపడేవారు అన్నట్లుగా సమాచారం. ఇక ప్రతి ఒక్కరిని ప్రేమించడం , గౌరవించడం, మాటకి కట్టుబడి ఉండడం ఆయన ప్రత్యేకత అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ తో కేవలం ఒక్క సినిమా తీసినా చాలని అప్పట్లో నిర్మాతలు సైతం చాలా అనుకునేవారు. ఆయనతో తప్పకుండా ఒక సినిమా తీయాలని పట్టుదలతో ఇండస్ట్రీకి వచ్చారు నిర్మాత అశ్వినీ దత్.producer ashwini dutt latest commentsNews JANI | News Jani

ఇక ఆయన తన బ్యానర్ లోగో పై ఎన్టీఆర్ కనిపిస్తూ ఉన్నారు అంటే ఎన్టీఆర్ పట్ల ఆయనకు ఎంతటి ప్రేమ, అభిమానం ఉందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఈయన .. ఎన్టీఆర్ తో తన కున్న అనుబంధాన్ని కూడా వివరించారు. ఎన్టీఆర్ గారి గురించి ఇంతవరకు నేను ఎక్కడా చెప్పని ఒక విషయం చెబుతాను.. ఎదురులేని మనిషి సినిమాను ఎన్టీఆర్ గారితో చేయాలనుకున్నప్పుడు ఆయన తన పారితోషకం ఇంత అని చెప్పలేదు. ఇంత ఇవ్వమని కూడా అడగలేదు.NTR 96th Birth Anniversary: Phenomenal Celluloid Achievements of the Telugu  Demigod | Telugu Movie News - Times of India

ఆ తర్వాత మాత్రం కథానాయకగా వాణిశ్రీని తీసుకోవడం జరిగింది . అప్పటికి వరుస హిట్ల తో తీసుకుపోతోంది.. పారితోషికం గా ఆమె రెండు లక్షల రూపాయలు అడిగారు. ఆమెనే కావాలని అనుకుంటున్నాము కనుక అలాగే ఇచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ కి రూ.1,75,000 ఇచ్చాము. వాణిశ్రీ కి రూ.2 లక్షలు ఇచ్చాం కదా అని ఎన్టీఆర్ రూ.2.50 లక్షలు అడగొచ్చు అని ఆయన ఇంటికి వెళ్లి తీసుకువెళ్లి ఇవ్వగా. ఆయన ఆ డబ్బు కట్టలను ఒకసారి లెక్కవేయగా అందులో పారితోషకం ఎక్కువగా ఉంటే.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశారు.. మనం మాట్లాడుకున్నది రూ.2లక్షలే కదా అని మిగతా డబ్బులను వెనక్కి ఇచ్చాడని తెలిపారు. దీంతో ఆయన గొప్పతనం ఇదే అని తెలిపారు. ఇలాంటి పద్ధతి ఏఎన్ఆర్ లోను ,కృష్ణ ,శోభన్ బాబు, కృష్ణంరాజు , చిరంజీవిలో కూడా చూశానని తెలిపారు.

Share post:

Latest