అల్లు అర్జున్ స్టార్ డం చూస్తే మతి పోతోంది… ఇదిగో ఇదే ఉదాహరణ!

అల్లు అర్జున్ స్టార్ డం ఇప్పుడు మామ్మూలుగా లేదు. అవును… పుష్ప సినిమాతో అల్లు వారి అబ్బాయి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు. ఇక మనోడికి మలయాళం మార్కెట్ ఉండనే వుంది. అంతటి గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇతగాడు అందరికంటే అత్యధికముగా ఇన్ స్టా గ్రామ్ తో పాటు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ సరసన నిలిచాడు. తాజాగా అల్లు అర్జున్ కి అరుదైన ఘనత దక్కింది.

ట్విట్టర్ లో 7 మిలియన్ ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సౌత్ లో అతి తక్కువ మంది సాధించిన ఆ 7 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసికొని రికార్డు నమోదు చేసాడు. పుష్ప స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో 7 మిలియన్ ల ఫాలోవర్స్ ను చేరుకున్న సందర్భంగా ఈ ఫోటోను షేర్ చేసి తన ఆనందంను పంచుకున్నాడు. 7 మిలియన్లు… ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ లో ఈ ఫోటోను షేర్ చేశాడు. అల్లు అర్జున్ ట్విట్టర్ ఫాలోయింగ్ చాలా స్పీడ్ గా పెరిగిపోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను త్వరలో షూటింగ్ ట్రాక్ లో పెట్టనున్నాడు. కేజీఎఫ్ 2 రేంజ్ లో తీయబోతున్నట్లుగా బన్నీ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. పుష్ప 1 మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక పుష్ప 2 సినిమా వెయ్యి కోట్లను టచ్ చేస్తుందనే నమ్మకంతో బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం ధీమాగా వున్నారు.

Share post:

Latest