బాబుని వదలని ‘కుప్పం’ భయం…!

ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు.

అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి బాబు..కుప్పం వదిలి పెట్టడం లేదు. అసలు సాధారణ ఎన్నికల సమయంలో ప్రచారం పక్కన పెడితే కనీసం నామినేషన్ వేయడానికి కూడా బాబు వెళ్లరు…స్థానిక టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయిస్తారు. అలా చేసిన సరే కుప్పం ప్రజలు బాబుకే పట్టం కడుతూ వచ్చారు. ఎప్పుడు అక్కడ ఓటమి రాలేదు. కానీ ఫస్ట్ టైమ్ బాబుకు ఓటమి భయం పెరిగింది.

స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఓటమితో…అసెంబ్లీ స్థానంలో కూడా ఓడిపోతామనే భయం మొదలైంది. అందుకే కనీసం 2 నెలకొకసారి అయిన బాబు కుప్పం వెళుతున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్తితులని తెలుసుకుంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలతో భేటీ అయ్యి పార్టీ పరిస్తితిని తెలుసుకుంటున్నారు. మళ్ళీ ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటున్నారు.

ఇప్పటికే బాబు పలుమార్లు కుప్పం పర్యటనకు వెళ్లారు. ఇదే క్రమంలో ఈ నెల 24న మరొకసారి కుప్పం వెళ్ళేందుకు బాబు సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్నారు. అయితే ఇలా కుప్పంని వదలకుండా బాబు పనిచేస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఇంకా దూకుడుగా పనిచేస్తుంది.

కాకపోతే స్థానిక ఎన్నికల్లో గెలిచిన ఊపు ఇప్పుడు వైసీపీలో కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలిచేశాం కదా…ఇంకా అసెంబ్లీలో కూడా గెలిచేస్తామనే ధీమా వైసీపీ నేతల్లో ఉంది. పైగా  స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమాలు ఎక్కువ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది…దీని వల్ల వైసీపీకే నష్టం జరిగేలా ఉంది. మొత్తానికి కుప్పంలో నిదానంగా బాబుకు అనుకూలంగా పరిస్తితులు మారుతున్నాయి.