ఆదిపురుష్ తెలుగు రైట్స్ @ రు.100 కోట్లు… కొన్న‌ది ఎవ‌రంటే…!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల‌లో న‌టిస్తున్నారు. తాజా గా ఈ సినిమా పై ఒక వార్త సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది, ప్రముఖ నిర్మాణ సంస్థ, ప్ర‌భాస్ హోం బ్యాన‌ర్ అయిన‌ యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్‌ను తెలుగు పంపిణీ హక్కులను ఏకంగా రు. 100 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆదిపురుష్ సినిమా మేక‌ర్స్‌ కానీ, యూవీ క్రియేషన్స్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆదిపురుష్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు, ఇంగ్లీషు డబ్బింగ్ వెర్షన్‌ను ఓవర్సీస్‌లో కూడా విడుదల చేస్తున్నారు. ఆదిపురుష్ జనవరి 12, 2023 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ వ‌రుస‌గా స‌లార్‌, ప్రాజెక్ట్ కే, స్పిరిట్‌, మారుతి సినిమాల‌లో న‌టిస్తాడు.

Share post:

Latest