వైసీపీలో మ‌రో ఎంపీ యూట‌ర్న్‌.. రీజ‌నేంటి..?

ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజ‌కీయాలు చిత్రంగా ఉన్నాయ‌ని అం టున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న 2019 వ‌ర‌కు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనూహ్యం గా టీడీపీ సైకిలెక్కిన ఆయ‌న .. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నిక‌ల‌కుముందు.. వైసీపీలో చేరిపోయారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

MP Magunta Sreenivasulu Reddy tested Covid-19 positive | ఎంపీ మాగుంట  శ్రీనివాసులు రెడ్డికి కరోనా | ఏపీ News in Telugu

కానీ, ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో మింగిల్ కాలేక పోతున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి స‌హా ఇత‌ర మం త్రుతోనూ ఆయ‌న క‌లిసి మెలిసి ప‌నిచేయ‌డం లేదు. ఇక‌, ఎమ్మెల్యేల‌కు కూడా ఆయ‌న అందుబాటులో ఉండ‌డం లేద‌నే టాక్ ఆది నుంచి వినిపిస్తున్న‌దే. మ‌రోవైపు.,. పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రిగిన‌ప్పుడు.. ఆయ‌న టీడీపీ ఎంపీలతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌నే వాద‌న ఉండ‌నే ఉంది.

ఈ నేప‌థ్యంలో నే మాగుంట ఎక్కువ కాలం వైసీపీలో ఉండ‌రని.. టీడీపీలోకి వెళ్లిపోతార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అయితే..తాజాగా ఆయ‌న దీనిని ఖండించారు. తాను సీఎం జ‌గ‌న్‌తోనే ఉన్నాన‌ని.. ఉంటాన‌ని.. పేర్కొంటూ.. త‌న కుటుంబంపై వ‌స్తున్న వ్య‌తిరేక వార్త‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. అయితే.. ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు. అయితే.. ప్రస్తుతం.. వైసీపీలో ఉంటేనే కేంద్రంలో త‌ను చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంటుంద‌ని.. మాగుంట భావిస్తున్న‌ట్టు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

మాగుంట చూపు వైసిపి వైపు..! త‌న వ‌ర్గంతో ప్ర‌త్యేక స‌మావేశం : సీయంఓ నుండి  కాల్..! | Magunta Srinivasa Reddy secret meeting : He may join in YCP.. -  Telugu Oneindia

ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల్లోనూ మాగుంట‌.. మ‌ద్యం వ్యాపారాలు చేస్తున్నారు. ఇవి స‌క్ర‌మంగా సాగాలంటే.. కేంద్రంలో త‌మ‌కు అనుకూల‌మైన నాయ‌కులు అవ‌స‌రం అనేది మాగుంట‌కు తెలియ‌నికాదు. జ‌గ‌న్ అయితేనే.. కేంద్రంలో త‌న‌కు సేఫ్ అవుతుంద‌ని.. రాజ‌కీయంగా కూడా ..త‌న‌కు బాగుంటుంద‌ని.. ఆయ‌న త‌ల‌పోసి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో మాగుంట యూట‌ర్న్ తీసుకుని వుంటార‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇలా యూట‌ర్న్ తీసుకున్నా.. ఆయ‌న‌తో వైసీపీ నేత‌ల‌కు ఏమేర‌కు స‌త్సంబంధాలు ఏర్ప‌డ‌తాయో చూడాలి.

Share post:

Latest