వారంతా ఏమైపోయారు… జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది…!

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే గ‌ట్టిగా ఉంది. ఆ త‌ర్వాత‌.. అంతా కూడా.. టికెట్ల పంప‌కాలు.. ప్ర జల దృష్టిలో చేయాల్సిన ప‌నులు.. మేనిఫెస్టోల రూప‌క‌ల్ప‌న‌.. ఇలాంటి అనేక కార్య‌క్ర‌మాలు ఉంటాయి. సో.. ఏదైనా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలంటే.. ఇదే మంచి స‌మ‌యం… మించితే దొర‌క‌దు అన్న‌ట్టుగా నాయ‌కు లు ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇత‌ర పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన‌.. జ‌న‌సేన‌లో మాత్రం నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి ముందు.. అనేక మంది నాయ‌కులు.. జ‌న‌సేన జెండా ప‌ట్టుకుని తిరి గారు. వారిలో చాలా మంది ప్ర‌జ‌లకు తెలియ‌దు.. అప్ క‌మింగ్ నాయ‌కులుగా ప‌రిచ‌యం అయ్యారు. జ‌న సేనాని ప‌వ‌న్ వారంద‌రినీ న‌మ్మారు. వారికి టికెట్లు కూడా ఇచ్చారు. ఇలా.. కొత్త‌గా వ‌చ్చిన వారికి దాదాపు 100 మంది కి ఆయ‌న టికెట్లు ఇచ్చారు. వారంతా ప్ర‌య‌త్నం చేశారు. కానీ,. జ‌గ‌న్ సునామీలో వారంతా కొట్టుకుపోయారు. అయితే.. రాజ‌కీయంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌నే విమ‌ర్శ ఉంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌కు అధికారంపై ధ్యాస‌లేదు కాబ‌ట్టి..వారంతా సైలెంట్‌గా ఉన్నార‌ని అనుకు న్నా.. ఇటీవ‌ల ఆయ‌న టోన్‌మార్చారు. ల‌క్ష్యం పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధి అని ప్ర‌క‌టించారు. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఏం చేస్తానో.. కూడా చెబుతున్నారు. అంటే.. అధికారం కోసం.. జ‌న‌సేన కూడా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌నే సంకేతాలు వ‌చ్చేశాయి. మ‌రి దీనినిబ‌ట్టి అయినా.. నాయ‌కులు… ముందుకు రావాలి క‌దా!

కానీ, ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు.. జ‌న‌సేన‌లో ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓడిపోయిన వారిలో ప‌ట్టుమని ప‌ది మంది కూడా .. ఇప్పుడు యాక్టివ్‌గా లేరంటే అతిశ‌యోక్తికాదు.. పోతిన మ‌హేశ్ వంటి ఒక‌రిద్ద‌రు మాత్రమే.. ప‌వ‌న్ ఆదేశాల‌కు, పార్టీలైన్‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. మీడియాలో క‌నిపిస్తున్నారు. మ‌రి మిగిలిన వారి సంగ‌తి ఏంటి? కేవ‌లం ప‌వ‌న్ ఇమేజ్‌ను న‌మ్ముకున్నారా? లేక‌.. ఇంకా ఎన్నిక‌లు చాలా రోజులు ఉన్నాయి కాబ‌ట్టి.. ఇప్పుడే వ‌ద్ద‌నుకున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. గ‌తంలో పోటీ చేసిన వారు.. ముందుకు వ‌స్తే.. పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని మేధావులు చెబుతున్నారు.

Share post:

Latest