వంశీకి తిరుగులేదు..ఆ ముగ్గురే డౌట్?

టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన ఎమ్మెల్యేలకు వైసీపీలో దాదాపు సీట్లు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు…వైసీపీలో పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్…టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు.

డైరక్ట్ వైసీపీలో జాయిన్ అవ్వలేదు…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి పరోక్షంగా వైసీపీకి మద్ధతుగా నిలిచారు. అయితే ఎంత కవర్ చేసుకున్న వారు వైసీపీ అనధికార ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఇలా వైసీపీ వైపుకు వచ్చిన ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురుకు దాదాపు సీట్లు ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తోంది. ఇప్పటికే వంశీకి గన్నవరం సీటు ఫిక్స్ అని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పేశారు. అటు గణేశ్…విశాఖ సౌత్ లో పోటీ చేస్తారని, ఇటు గుంటూరు వెస్ట్ లో మద్దాలి గిరి పోటీ చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

అయితే చీరాల ఎమ్మెల్యే కరణం విషయమే ఇంకా తేలలేదు…అక్కడ ఆమంచి కృష్ణమోహన్ సైతం సీటు కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి..ఇంకా చీరాల విషయంలో క్లారిటీ రాలేదు. మొత్తానికి మిగతా ముగ్గురుకు సీట్లు ఫిక్స్ అయ్యాయనే చెప్పొచ్చు. సీట్లు ఫిక్స్ అవ్వడం పక్కన పెడితే…నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు ఎవరికి సాధ్యపడుతుందనే విషయం ఒక్కసారి చూసుకుంటే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే…గన్నవరంలో వంశీకే గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

మిగిలిన ముగ్గురుకు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. కరణంకు ఎలాగో ఇంకా సీటు కన్ఫామ్ కాలేదు కాబట్టి. గిరి, గణేశ్ ల పరిస్తితి చూసుకుంటే…ఈ సారి వారికి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి జంపింగ్ ఎమ్మెల్యేల్లో వంశీకే గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.