రఘురామ కోసం టీడీపీ త్యాగం!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు.

టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం చేసుకుంటూ వస్తుంది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటుని బీజేపీకి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో…నరసాపురం పార్లమెంట్ బరిలో టీడీపీ తరుపున వేటుకూరి శివరామరాజుని బరిలో దింపారు. అయితే తక్కువ మెజారిటీతో శివ…రఘురామకృష్ణంరాజుపై ఓడిపోయారు.

ఇక రఘురామ వైసీపీ నుంచి గెలిచి…ఆ పార్టీపైనే ఎలా తిరుగుబాటు చేస్తున్నారో తెలిసిందే…అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ నరసాపురం బరిలో నిలబడి…వైసీపీని ఓడించాలని రఘురామ చూస్తున్నారు. కానీ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఏ పార్టీ అయినా గాని టీడీపీ సపోర్ట్ ఉంటేనే రఘురామ గెలవగలుగుతారు. ఒకవేళ టీడీపీతో జనసేనతో పొత్తు ఉంటే…నరసాపురం సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది..అప్పుడు రఘురామ జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది..పొత్తులో బీజేపీ కూడా ఉంటే…నర్సాపురం బీజేపీకి దక్కితే..అప్పుడు రఘురామ బీజేపీ నుంచి పోటీ చేయొచ్చు.

కానీ ఎటు చూసిన ఈ సీటు టీడీపీకి దక్కేలేదు…ఒకవేళ టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తే…రఘురామ టీడీపీలోకి వచ్చి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.  ఏదేమైనా గాని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శివరామరాజు మాత్రం..ఈ సారి వేరే సీటులోకి వెళ్తారు. అయితే ఆయన తన సొంత సీటు ఉండిలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే రఘురామ కోసం నరసాపురంలో టీడీపీ త్యాగం చేయాల్సిందే.