మళ్లీ మొదలైన ప్రభాస్ బడా ప్రాజెక్ట్.. ఈసారి గురి తప్పదు!

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తావన అవసరం లేదేమో. ఇపుడు ప్రభాస్ అంటే తెలియనివారు ఇండియాలోనే వుండరు. అంతలా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయాడు ప్రభాస్. బాహుబలి సినిమా అతని జీవితాన్ని మార్చివేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు డార్లింగ్. ఇకపోతే ఇప్పుడు యావత్ భారత్ సినిమా పరిశ్రమలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చెప్పుకోవచ్చు. అయితే బాహుబలి II తరువాత మాత్రం అతని సినిమాలు బక్షాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ప్రభాస్ నిరంతరంగా సినిమాలు చేస్తూనే వున్నాడు.

బడా ప్రాజెక్టు ఇదే:

నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఆ వెంటనే గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్ K షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ప్రాజెక్ట్ కే సినిమా కు సంబంధించిన షూటింగ్ కొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయ్యింది. ఇక ప్రాజెక్ట్ కే కోసం దీపిక పదుకునే ఇటీవలే హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసినదే. మొన్నటి వరకు విదేశాల్లో భర్తతో కలిసి చక్కర్లు కొట్టి హాలిడేస్ ను ఎంజాయ్ చేసిన దీపిక ముంబయికి ఇటీవలే తిరిగి వచ్చింది.

మరింత సమాచారం:

ఇక సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ యూనిట్ సభ్యుల ద్వారా అనధికార సమాచారం అందుతోంది. దాంతో ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి ఆఖరికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సలార్ మరియు ఆదిపురుష్ ల తర్వాత ప్రాజెక్ట్ K వస్తుందని అభిమానులు వేయికళ్లతో ఎదురు చేస్తున్నారు.

Share post:

Latest