పవన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న రజినీకాంత్.. వీడియో బయటపెట్టిన కమెడియన్..!!

సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన విదేశాలలో సైతం పాపులారిటీని సంపాదించుకొని జపాన్ వంటి దేశాలలో కూడా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక ఆయన కష్టం వెనుక ప్రతిఫలం ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇకపోతే ఏకంగా సూపర్ స్టార్ ఆయన నటనను చూసి ఇతడే నా తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ అని పొగిడాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ కమెడియన్ సునీల్ ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.Superstar Rajinikanth's stunning photo after 'Jailer' test shoot overflows  with energy - Tamil News - IndiaGlitz.comసూపర్ స్టార్ రజినీకాంత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం కథానాయకుడు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సునీల్ నటించిన విషయం అందరికీ తెలిసిందే . ఇకపోతే కథానాయకుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న జల్సా సినిమా ప్రాజెక్టును కూడా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే అదే సమయంలో సెన్సార్ బోర్డు వారు జల్సా టైటిల్ తో పవన్ కళ్యాణ్ వెనుక కత్తి పట్టుకొని రౌద్రంగా ఉన్న ఫోటోలు విడుదల చేయడం జరిగింది.. ఇక ఈ పేపర్ క్లిప్ ను సునీల్ రజనీకాంత్ కు చూపిస్తూ త్రివిక్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్ సర్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాడు అని చెప్పారట.Sunil Varma in Trivikram - Pawan Kalyan's Movie Was Just a Rumor

అప్పుడు రజనీకాంత్.. అవును నిజమే త్రివిక్రమ్ గురించి నేను కూడా విన్నాను అని తెలిపాడట . ఇక ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆ పోస్టర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను చూసి ఇతనేనయ్యా నా తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పడంతో సునీల్ తో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారట. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున హార్షం వ్యక్తం చేస్తున్నారు.

https://youtube.com/shorts/KJXF1UvS5dU?feature=share