మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. అవి ఏంటంటే..!?

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ.ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాల్లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ ప్రతిభ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలిసింది. దీంతో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు చేసినా అది పాన్ ఇండియా ప్రాజెక్టు అవ్వాలని అంచనాలు ఉన్నాయి. వీటికి తగ్గట్టే కథల ఎంపికలో ఎన్టీఆర్ కూడా ఆచితూచి అడుగేస్తున్నాడు. తాజాగా ఓ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రకటించి, అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేశాడు. దీనిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఎన్టీఆర్ అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులకుందరికీ ఈ సినిమా ఎంతగానో నచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశాన్ని ఈ సినిమా అందించింది. దీంతో కొరటాలతో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించేందుకు ఎన్టీఆర్ పచ్చజెండా ఊపాడు. ఇక మరో వైపు కేజీఎఫ్ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ తాను ఎన్టీఆర్ అభిమానని చెప్పాడు. ఆయనతో కూడా సినిమాను ఎన్టీఆర్ చేయనున్నాడు.


ఈ రెండు భారీ ప్రాజెక్టులకు ఒకేసారి ఎన్టీఆర్ ఓకే చెప్పడం అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అయితే ఇటీవలే చిరంజీవితో కొరటాల శివ చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని కొరటాలకు ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ తన 30వ, 31వ ప్రాజెక్టుల్లో ఏది ముందో ఏది వెనుకలో తెలియడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలోనే వచ్చే సినిమానే ఎన్టీఆర్ తొలుత పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Share post:

Latest