మాచర్ల నియోజవర్గం ట్రైలర్.. రాజమౌళి, బోయపాటి, త్రివిక్రమ్‌లను వాడేసుకున్న నితిన్!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుండి, పోస్టర్స్, టీజర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో నితిన్ వైవిధ్యంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ఫుల్ అంశాలతో నింపేశారు. ‘మాచర్ల నియోజకవర్గం’లో కొత్త కలెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నితిన్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అక్కడ రాజప్ప అనే విలన్ ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నాడనేది హీరో దృష్టికి వెళ్లడంతో, కలెక్టర్‌గా ఉంటూనే రాజప్పపై ఆయన ఎలాంటి యుద్ధం చేస్తాడనేది మనకు సినిమా కథగా చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో నితిన్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా ఆయన వేసే డైలాగుల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో రాజమౌళి, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్‌ల పేర్లను కూడా వాడేశాడు మనోడు.

ఓవరాల్‌గా చూస్తే మాచర్ల నియోజకవర్గం చిత్రం క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర యూనిట్ తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాల అందాల ఆరబోతలు ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 12న మాచర్ల నియోజకవర్గం సినిమాను రిలీజ్ చేసేందుకు నితిన్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.