కన్నీరు మున్నీరు అవుతున్న మంచు లక్ష్మి.. తెలియని బాధ తగిలిందట?

మంచు లక్ష్మి… పరిచయం అక్కర్లేని పేరు. మంచు లక్ష్మి పేరు వినగానే గుర్తొచ్చేది తన భాష. అవును.. తన భాషను అనుసరించి ఎంతోమంది రీల్స్, షార్ట్స్ చేస్తూ వుంటారు. అంతలా మంచు లక్ష్మి తన భాషతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇక నిత్యం బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేయడం ఈ మంచు వారసురాలికి ఓ మంచి అలవాటు. ముఖ్యంగా కూతురు విద్యా నిర్వాణతో గడిపిన సంతోష క్షణాలను ఫ్యాన్స్‌తో ఎక్కువగా పంచుకుంటారు లక్ష్మి.

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో మంచు లక్ష్మి ఓ ఎమోషనల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. తన కుమార్తె విద్యా నిర్వాణను స్కూల్‌కి పంపించిన సందర్భంగా మంచు లక్ష్మి చాలా ఎమోషన్‌కు గురయ్యారు. ఈ వీడియో ఆమె మాట్లాడుతూ.. “లాక్‌డౌన్‌ సమయంలో స్కూల్స్‌ మూతపడటంతో పిల్లలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. అలాంటి సమయంలో విద్యాను 24 గంటలూ ఎలా తట్టుకోవాలి? అని అనుకున్నాను. కానీ రెండేళ్లు ఇంట్లోనే ఉండడంతో మా ఇద్దరి మధ్య ప్రేమ ఎంతగానో బలపడింది. ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత విద్యాను స్కూల్‌కి పంపించి, వస్తుంటే ఏదో తెలియని బాధగా ఉంది.” అంటూ వాపోయింది.

విద్యాకు దూరంగా ఉండడం అంత కష్టంగా ఉంటుందని తాను వూహించలేదట. త్వరలోనే దీనికి అలవాటుపడతానని తెలిసినా దుఃఖం ఆగట్లేదని కన్నీరు మున్నీరు అయింది లక్ష్మి. ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూతురు విద్యతో కలిసి మంచు లక్ష్మి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ‘చిట్టి చిలకమ్మ’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో కూతురుతో కలిసి తీసిన ఫన్నీ వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఈ ఛానల్‌కు ఇప్పటి వరకు 1,32,000కిపైగా మంది సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవడం విశేషం.

Share post:

Latest