నిహారిక తల్లి కాబోతుందంటూ న్యూస్ వైరల్.. అసలు విషయం ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మెగా డాటర్ కి కూడా అంతే గుర్తింపు ఉంది.. ఇక యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత ఓ మనసు , సూర్యకాంతం వంటి సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాలతో కూడా ఆమె హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడం గమనార్హం.అందుకే వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ చైతన్య జొన్నలగడ్డను 2020 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకుంది. ఇక వివాహం అనంతరం కూడా ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ బాగా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదో ఒక గ్లామర్ ఫోటోను షేర్ చేస్తూ మరింత పాపులర్ అయింది.Trending: Pics From Actress Niharika Konidela And Chaitanya JV's Engagement

ఇకపోతే వివాహం తర్వాత జిమ్ ట్రైనర్ తో ఈమె చేసే అల్లరి అలాగే పబ్బులో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అన్నీ చూసి నిహారిక అత్తింటి వారు కూడా ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్లు కూడా ఈమెను పూర్తిస్థాయిలో ట్రోల్ చేశారని చెప్పవచ్చు. ఇకపోతే సుమారుగా కొన్ని నెలల పాటు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా డిలీట్ చేసిన నిహారిక , ఆ తర్వాత మళ్లీ తన ఫోటోను షేర్ చేసి పాపులర్ అయింది. ఈ క్రమంలోని ఈమె ఎటువంటి ఫోటోను వీడియోను షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక తల్లి అయ్యిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు నిహారిక సోషల్ మీడియా వేదికగా తామిద్దరం ముగ్గురం కాబోతున్నామని కౌంట్ డౌన్ చేసినట్లు పోస్ట్ పెట్టారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..20 new photos from Niharika Konidela-Chaitanya JV's wedding | Entertainment  Gallery News,The Indian Express

అంతేకాదు ఇలా నిహారికనే స్వయంగా పోస్ట్ పెట్టిందని త్వరలోనే నిహారిక తల్లి కాబోతున్నారనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ నిహారిక సంబంధించిన ఈ వార్త తన సోషల్ మీడియా ఖాతాలలో ఎక్కడా కనిపించలేదు. ఎవరో కావాలనే ఒక రూమర్ స్ప్రెడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అందుకే నిహారిక గురించి వస్తున్నటువంటి వార్తల్లో ఏ విధమైన నిజం లేదని నెటిజన్స్ కొట్టి పారేస్తున్నారు.