ఎన్టీఆర్ నిర్మాత‌గా మార‌డం వెన‌క ఇంత క‌థ ఉందా…!

తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌నకంటూ ప్ర‌త్యేక అధ్యాయం ఏర్పాటు చేసుకున్న అన్న‌గారు.. ఎన్టీఆర్‌.. ఒక్క న‌టుడిగానే కాకుండా.. ద‌ర్శ‌కుడిగా.. నిర్మాత‌గా కూడా అనేక పాత్ర‌లు పోషించారు. అయితే.. ఏ పాత్ర చేసినా.. ఆయ‌న‌కు కార‌ణం ఉండేది. కేవ‌లం .. త‌న‌కు న‌చ్చ‌డం వ‌ల్లే..చేసిన పాత్ర‌లు కొన్ని అయితే.. తెర‌వెనుక నిర్మాత‌గా ఉంటూ.. ద‌ర్శ‌కుడిగా కూడా రాణించ‌డం వెనుక‌.. మ‌రికొంద‌రి ప్రోద్బ‌లం.. ప్రోత్సాహం వంటివి ఉన్నాయి.

NTR Birth Anniversary, NT Rama Rao: మరపురాని జ్ఞాపకం.. తెలుగు జాతి గౌరవం  'ఎన్టీఆర్' - happy birthday to legendary actor nandamuri taraka rama rao -  Samayam Telugu

 

ఇలాంటి హిస్ట‌రీలోనే అన్న‌గారు నిర్మాత‌గా మార‌డానికి కార‌ణం ఉంది. త‌న సోద‌రుడు.. త్రివిక్ర‌మ‌రావు.. ఎడిట‌ర్‌గా.. సంగీత ప‌ర్య‌వేక్ష‌కుడిగా ప‌నిచేసేవారు. అన్న‌గారు న‌టించి.. ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీతారామ క‌ళ్యాణం సినిమాకు.. త్రివిక్ర‌మ‌రావే నిర్మాత‌. అయితే.. అనుకున్న విధంగా ఈ సినిమాకు బ‌డ్జెట్ స‌రిపోలే దు. దీంతోత్రివిక్ర‌మ రావు.. అధిక వ‌డ్డీకి.. వాహినీ సంస్థ నుంచి అప్పు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఆ సంస్థ తాము అప్పుగా ఇవ్వ‌బోమ‌ని.. స‌హ నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకుంటాని.. చెప్పింది.

అంటే.. సినిమాలో వ‌చ్చే వాటాలో వారు పెట్టిన పెట్టుబ‌డికి త‌గిన విధంగా ఆదాయం ఇవ్వాల్సి ఉంటుం ది. అయితే.. దీనికి తొలుత త్రివిక్ర‌మరావు అంగీక‌రించ‌లేదు. కానీ, సినిమా షూటింగ్ ఆగిపోతే.. అప్ప‌టికే పెట్టిన పెట్టుబ‌డి న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంటుంది. అలాగ‌ని.. అన్న‌గారికి చెప్ప‌లేరు. డ‌బ్బులు చూసుకో కుండా.. ఎందుకు మొద‌లు పెట్టావ్‌! అని ఆగ్ర‌హించే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ రావు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు.

Producers of NTR's Mayabazar had nearly rejected his Krishna role -  Hindustan Times

చివ‌ర‌కు.. ఈ విష‌యం అన్న‌గారికి తెలియ‌నే తెలిసింది. దీంతో ఆయ‌న త్రివిక్ర‌మ‌రావుకు డ‌బ్బులు స‌ర్దుబాటు చేసేలా.. వాహిన స్టూడియోతో ఒప్పించారు. అయితే.. అప్పుగానే సొమ్ములు ఇచ్చేలా మాట్లాడారు. ఇక‌, ఆ సినిమా హిట్‌కావ‌డంతో.. వాహిని అప్పును తీర్చేశారు. ఇక ఆ త‌ర్వాత నుంచి త‌మ్ముడు ఏ సినిమా తీసినా.. నిర్మాత‌గా.. త‌నే ఉండేవారు. మొద‌ట్లో నిర్మాత‌: త్రివిక్ర‌మ రావు అని వేసుకునేవారు. కానీ, త‌ర్వాత ఒక‌టి రెండు సినిమాల‌కు మాత్రం.. రామారావు పేరు వేసుకున్నారు. ఇదీ.. అన్న‌గారు నిర్మాత‌గా మార‌డానికి దారితీసిన ప‌రిస్థితి!