నా ప్రతి సినిమాలో ఆ సీన్ ఉండాల్సిందే.. కృతి సెంటిమెంట్ వింటే పిచ్చెక్కిపొవాల్సిందే..!?

మనిషి అన్నాక కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. ఎంతటి పెద్ద హీరో అయినా..హీరోయిన్ అయినా..కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. మంగళవారం షూటింగ్ స్టార్ట్ చేయకూడదు అని..మంచి రోజుల్లోనే షూటింగ్ పనులు ప్రారంభించాలని..ఇంకొందరు అయితే..హీరోలను సెంటిమెంట్ గా భావిస్తారు. ఆ హీరో తో చేస్తే హిట్ పడుతుందని. అలా ఒక్కో హీరో, హీరోయిన్స్ కి ఒక్కోలా ఉంటాయి సెంటిమెంట్లు. కానీ, ఈ కన్నడ బ్యూటి కృతి శెట్టి సెంటిమెంట్ వింటే పిచ్చెక్కిపోవాల్సిందే.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేనా..వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ..టప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. నాని తో శ్యామ్ సింగరాయ్..నాగ చైతన్య,నాగార్జునతో బంగార్రాజు ..ఇలా మూడు సినిమాలో హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ హీరో గా నటించిన ది వారియర్ మూవీ మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే, రీసెంట్ గా ఓ కోలీవుడ్ మీడియా తో ఇంటర్వ్యుల్లో ముచ్చటించిన ఈ కన్నడ బ్యూటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పి షాకిచ్చింది. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు గా దాని పై మీ అభిప్రాయం అని అడగ్గా..అంతా టీం వర్క..ఒక్క హీరో వల్లే సినిమా హిట్ అవ్వదు..అలా అని హీరోయిన్స్ వల్లే ఫ్లాప్ అవ్వదు..ఏది జరిగిన అది మొత్తం ఆ సినిమా టీం వల్లే జరుగుతుంది..అంటూ చెప్పుకొచ్చింది.ఇక తన సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది.

“తన ప్రతి సినిమాలో హీరో తో బైక్ పై జామ్ జామ్ అని షికారుకి వెళ్ళాలి..అలా హీరోతో బైక్ సీన్స్ ఉంటే నా సినిమా మంచి విజయం అందుకుంటుందని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చిందట. ఇప్పటి వరకు వచ్చిన అన్ని కృతి సినిమాల్లో అలాంటి సీన్స్ ఉన్నాయి. అమ్మడు మాటలు వింటుంటే రాబోయే సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ ఉంటాయని అర్ధమైపోతుంది. మరి చూడాలి అమ్మడు నెక్స్ట్ సినిమా మాచర్ల నియోజకవర్గం ఎలాంటి హిట్ అందుకుంటుందో..?