కాజల్ అగర్వాల్ ఇక నటించదా? రీ ఎంట్రీ ఇక లేనట్టేనా?

టాలీవుడ్ చందమామ అందాల కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఓ దశాబ్దానికి పైగా తెలుగు ప్రేక్షకుల్ని ఈమె మంత్రముగ్ధుల్ని చేసింది. చిన్న చిన్న హీరోలతో మొదలుపెట్టి దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి, మెప్పించింది. టాలీవుడ్ తరువాత కోలీవుడ్ లోనూ ఇదే దూకుడు కొనసాగించింది. ఆ రకంగా తెలుగు.. తమిళ భాషలు అమ్మడికి ఎంతో ప్రత్యేకం. అయితే గౌతమ్ కిచ్లు తో ప్రేమ పెళ్లి తర్వాత అమ్మాయి సినిమాలు తగ్గించింది. ఈ తరుణంలో తనకు తానుగానే కావాలనే సినిమాల నుంచి తప్పుకుందని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. వివాహం తర్వాత కాస్త సెలక్టివ్ గా వెళ్లడం మొదలు పెట్టింది.

రీ ఎంట్రీ ఉంటుందా?

ఈ నేపథ్యంలో అమ్మడుకి సినిమా ఛాన్సులు కూడా తగ్గుముఖం పట్టాయి. అలాగే ఆమె వరకు వెళ్లిన సినిమాలను తిరస్కరిస్తూ వస్తోంది. అందువలన కాజల్ రి ఎంట్రీ మరలా ఉండదని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కాజల్ అభిమానులు మాత్రం కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక గర్భం దాల్చిన తర్వాత సినిమా అనే ప్రపంచానికే దూరమైంది. ఇక ఓ పాపాయికి జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికే అంకితమైంది కాజల్. ఈ నేపథ్యంలో కాజల్ రీ ఎంట్రీ కి రెడ అవుతుందా? రిటైర్మెంట్ ప్రకటిస్తుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

రిటైర్మెంట్ ప్రకటిస్తుందా?

ఇకపోతే చందమామ కాజల్ తన చెల్లితో కలిసి వ్యాపారాన్ని ఓ గాడిలో పెట్టడానికి సమయాన్ని కేటాయించనుందని వినికిడి. ఇప్పటికే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ నిషా జ్యుయలరీ, ఫుట్ వేర్ బిజినెస్ లో తనమునకలై వుంది. కాజల్ పెట్టుబడులు కూడా అందులో ఉన్నాయి. సినిమా రంగంలో రాణించలేని నిషా తో కాజల్ నే ఆ వ్యాపారం ప్రారంభించిందని సమాచారం. అటుపై ఆ బిజినెస్ ని నిషా అగర్వాల్ సక్సెస్ చేసింది. కానీ ఇంకా అనుకున్నంత ప్రాఫిట్స్ రాలేదట. ఇక అందుకే ఇప్పుడు కాజల్ చెల్లితో కలిసి మరిన్ని వ్యాపారాలు మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తుందని వినిపిస్తుంది.