వైసీపీలో ఈ టాప్ లీడ‌ర్ల విష‌యంలో జ‌గ‌న్ యాక్ష‌న్ త‌ప్ప‌దా… దిమ్మ‌తిరిగే షాకే..!

సీఎం జ‌గ‌న్ అనేక మార్లు చెవిలో ఇల్లు క‌ట్టుకుని పోరు చేస్తున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌ల‌వాల‌ని, వారి క‌ష్టాలు తెలుసుకోవాల‌ని.. ఎమ్మెల్యేల‌కు సూచిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌ల మ‌ద్య ఉండ‌డం లేదు. సుమారు 70 మంది మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నార‌ని.. తాజా లెక్క‌లు తేల్చి చెబుతున్నాయి. మ‌రి దీనిని బ‌ట్టి.. వారిని ఏం చేయాల‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది.

AP MLC Election: YCP focus on MLC elections .. Leader exercise towards  clean swipe .. Candidates announcement in a day or two! | AP MLC Election  2021: YCP focus on MLC elections,

 

 

 

ఎక్క‌డా కూడా.. జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌ని.. వారిని ఇప్ప‌టి వ‌ర‌కుచూసీ చూడ‌న‌ట్టు వ‌దిలే సిన దాఖ‌లా అయితే.. క‌నిపించ‌లేదు. పార్టీ ముఖ్యం..పార్టీతోపాటు.. అధికారం ముఖ్యం. ఈ రెండు మించి .. ఏ పార్టీ అధినేత‌కైనా.. ఇంకెవ‌రూ ముఖ్యం కాదు. అది జ‌గ‌నైనా..చంద్ర‌బాబైనా.. ఇంకెవ‌రైనా కూడా.. ! ఇలా చూసుకున్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌తో లేని నాయ‌కుల‌ను.. జ‌గ‌న్ మాట‌ను ల‌క్ష్య పెట్ట‌ని నేత‌ల‌ను ఎందుకు కొన‌సాగించాల‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఇప్పుడు వైసీపీ అధినేత కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఆళ్ల నాని.. గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. వీరు.. ఒక్క‌రోజు కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య లేరు. జ‌గ‌న్ చెప్పినట్టు మ‌న‌సు పెట్టి.. మ‌నుషుల స‌మ‌స్య‌లు తెలుసుకున్న‌దీ లేదు. మ‌రి వీరి ప‌రిస్థితి ఏంటి? వీరిని ఏం చేయాలి? అనేది పార్టీలో ప్ర‌శ్న‌. మ‌రోవైపు.. ఒక‌రిని చూసి ఒక‌రు నేర్చుకుంటు న్న‌ట్టుగా వ్య‌వ‌హారం మారిపోయింది.

Will the image of YCP change with Konda Reddy's Arrest?

వాళ్లు వెళ్ల‌డం లేదు క‌దా.. అంటూ.. చాలా మంది నాయ‌కులు కూడా వీరిబాట‌లోనే న‌డుస్తున్నారు. నూజివీడు, కైక‌లూరు, పామ‌ర్రు, తిరువూరు.. ఇలా ఎక్క‌డ చూసినా.. నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగానే.. గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. దీంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలిసే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఇలాంటి వారి విష‌యంలో జ‌గ‌న్ స్ట్రాంగ్ రియాక్ష‌న్ మామూలుగా ఉండ‌ద‌నే అంటున్నారు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. ఇలా.. వెళ్ల‌నివారు త‌మ‌కు గెలుపు త‌థ్య‌మ‌ని చెబుతుండ‌డ‌మే!