మృణాల్ ఠాకూర్.. టెలివిజన్ తెరపై సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరాఠీ సినిమా అయిన విట్టి దండు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలను అందుపుచ్చుకొని మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. లవ్ సోనియా అనే చిత్రం ద్వారా హిందీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో కూడా నటించింది. ఇకపోతే ప్రస్తుతం సీతారామంలో నటిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఈమె మాట్లాడుతూ మొదట బాలీవుడ్ సీరియల్ లో కుంకుమ భాగ్య అనే సీరియల్ లో నటించాను. ఇక ఈ సీరియల్ అన్ని భాషలలో డబ్ అయి..మంచి పేరు లభించింది .ఇలా తెలుగులో వైజయంతి మూవీస్ బ్యానర్ లో హీరోయిన్గా చేస్తానని నేను అనుకోలేదు. అందులో కూడా దుల్కర్ సల్మాన్ హీరోగా , అశ్విని దత్ నిర్మాతగా చేస్తున్న సినిమా తనకు ఒక గొప్ప అచీవ్మెంట్ అని ఆమె తెలిపింది .ముఖ్యంగా సీతారామంలో సీత పాత్ర గురించి హను రాఘవపూడి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. హిందీలో జెర్సీ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా.. నేను చండీఘర్ లో ఉన్నానని, ఆ సమయంలో ఒకసారి హాను రాఘవపూడి గారు కలవమని చెప్పారు. ఇక అలా ముంబై షాప్ లో ఒక కాఫీ షాప్ లో కలిసాము . ఇక తర్వాత పూర్తి కథను ఆఫీసులో విన్నాను. ఆయన నేరేషన్ చేసే విధానం చూసి వెంటనే ఫిక్స్ అయ్యాను. అంటూ తెలిపింది. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ రష్మిక గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మృణాల్.రష్మిక గురించి మాట్లాడుతూ ఆమెలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.. తను ఒకరోజు ముంబై.. మరో రోజు చెన్నై .. ఫారిన్ ఇలా చాలా ఎనర్జీతో తిరుగుతూ ఉంటుంది. సెట్లో కూడా చాలా హుషారుగా ఉంటుంది . అందరి పై చాలా కేర్ తీసుకుంటుంది. కేర్ గా ఉంటుంది రష్మిక తో తమ కాంబినేషన్స్ సినిమాలో చాలా బాగున్నాయి అంటూ మృణాల్ తెలిపింది.