ప్రేమ..రెండు అంటే రెండు అక్షరాల పదమే. కానీ, ఇది చూపించే స్వర్గం..మిగిల్చే బాధ ఎన్ని జన్మలైన మరువలేనిది అంటుంటారు..ప్రేమికులు. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా కామన్. స్కూల్ డేస్ లోనే లవ్ అంటూ చదువును గాలికి వదిలేస్తున్నారు పిల్లలు. ఇక కాలేజ్ డేస్ కి వచ్చే సరికి..అన్ని అయిపోతున్నాయి. దీనిని ప్రేమ అంటారా అంటే కాదు అనే చెప్పాలి . ప్రేమ అనేది ఓ స్వచ్చమైన ఫీలింగ్..అది చెప్పితే అర్ధం కాదు..అనుభవిస్తేనే అర్ధమౌతుంది.
ఈరోజుల్లో ఒక్కో అమ్మాయి, అబ్బాయి..ముగ్గురేసి లవర్స్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఒకరు పోతే మరొకరు అంటూ రెడీ గా బాయ్ ఫ్రెండ్స్ ని పెట్టుకుని ఉంటున్నారు. అయితే, ఓ అమ్మాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే..ఖచ్చితంగా ఈ ఐదు పనులు చేస్తుంది అంటున్నారు ప్రేమ పండితులు. మీరు ప్రేమించిన అమ్మాయిని మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందా..లేదా, టైం పాస్ కి లవ్ చేస్తుందా అని మీరు ఈ ఐదు లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు.
మిమ్మల్ని నిజంగా ఓ అమ్మాయి ప్రేమిస్తే..ఆ అమ్మాయి మీ పై చూయించే ప్రేమను బట్టే మీకు తెలిసిపోతుంది. మీరు టైంకి భోజనం చేశారా లేదా అని , మీరు డైలీ ఏం చేస్తున్నారు అని ప్రతి గంటకు ఫోన్ చేసి..అడగాల్సిన అవసరం లేదు. మీరు అడగకుండానే ఓ అమ్మలా..మీ ఆకలి అర్ధం చేసుకుని..తినడానికి పెట్టే అమ్మాయి దొరికితే మీరు చాలా లక్కి.
అంతేకాదు, గిఫ్ట్ ఇవ్వలేదు, డ్రెస్ కొనివలేదు, బర్తడే కి పార్టీ ఇవ్వలేదు..అంటూ టార్చర్ చేసే అమ్మాయికన్నా.. తన జీవితంలో ముఖ్యమైన రోజు మీరు ఏమి ఇవ్వకపోయిన పర్లేదు..మీరు తనతో ఉంటే చాలు అనుకునే అమ్మాయి మీ లవర్ అయితే.. ఖచ్చితంగా అమె మీ భార్యను చేసుకోండి. డబ్బు, స్టైల్, ఈగో..కి ఇంపార్ టెన్స్ ఇచ్చే అమ్మాయిలను దూరం గా పెడితేనే మంచిది అంటున్నారు ప్రేమ పండితులు. లాస్ట్ గా ఒక్క మాట.. నీది, నాది అన్న పదం కన్నా..మనది అన్న ఫీలింగ్ ఉంటేనే లవర్స్ అయినా, భార్య భర్తలు అయినా..లైఫ్ లో సంతోషంగా ఉంటారు. సో, అలాంటి అమ్మాయి దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి ..!!