మాజీలని టెన్షన్ పెడుతున్న పవన్?

పవన్ కల్యాణ్ వల్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? పవన్ గాని టీడీపీతో కలిస్తే..తమకు గెలుపు కష్టమని ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? పైకి తమకు తిరుగులేదని చెప్పుకుంటున్నా…తమని జగన్ ఇమేజ్ కాపాడేస్తుందని అనుకుంటున్నా సరే..లోలోపల మాత్రం పవన్ వల్ల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల చాలామంది వైసీపీ నేతలు…ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలడం వైసీపీకి కలిసొచ్చింది…సుమారు…40 మంది పైనే ఎమ్మెల్యేలు టీడీపీ-జనసేన మధ్య ఓట్లు చీలడం వల్లే గెలిచారని చెప్పొచ్చు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు పవన్ గాని, టీడీపీతో కలిస్తే తమకు ఇబ్బందే అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది..పైగా గత ఎన్నికల్లో ఉన్నట్లు ఇప్పుడు జగన్ వేవ్ తగ్గుతుంది…అటు టీడీపీ-జనసేనల బలం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు గెలుపుపై బెంగ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మాజీ మంత్రులు బాగా టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది..పవన్, టీడీపీతో కలవకుండా ఉంటేనే బెటర్ అని వారు కోరుకుంటున్నారట. అయితే టీడీపీ-జనసేన కలిస్తే…ఎక్కువ రిస్క్ లో పడే వారిలో…పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆళ్ళ నాని, చెరుకువాడ రంగనాథరాజు, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మాజీ మంత్రులకు పవన్ తోనే ఎక్కువ టెన్షన్ ఉన్నట్లు ఉంది..ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ ఓట్లు చీల్చడం వల్లే వీరికి విజయాలు దక్కాయని చెప్పొచ్చు. మాజీ మంత్రులకు..తమ తమ నియోజకవర్గాల్లో టీడీపీపై వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ.  అంటే అప్పుడే టీడీపీ-జనసేన కలిస్తే వీరి పరిస్తితి ఏమయ్యాదో అర్ధం చేసుకోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో గాని పవన్…టీడీపీతో కలిస్తే మాజీల గెలుపు డౌటే. అందుకే పవన్ పొత్తు పై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే టెన్షన్ మాజీ మంత్రుల్లో ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.