జగనన్న…దూరం..దగ్గరవుతుందా!

ఎంతకాదు అనుకున్న…అధికార పార్టీ నేతలు కాస్త ప్రజలకు దూరమవుతారనే చెప్పాలి…ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు…ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండటం వల్ల వారు ప్రజల్లో ఎక్కువ తిరగలేరు…దీని వల్ల ప్రజల్లో వారికి ఆదరణ నిదానంగా తగ్గుతున్నట్లే ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటాయి..అందుకే ప్రజలు…ప్రతిపక్షాలకు కాస్త దగ్గరవుతారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండే నేతలు…అధికారంలోకి రాగానే కాస్త ప్రజలకు దూరం జరుగుతారు.

అయితే జగన్…ప్రతిపక్షంలో ఉండగా…పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉన్నారు..కానీ అధికారంలోకి వచ్చాక…ప్రభుత్వాన్ని నడిపే పనిలో పడి..కాస్త ప్రజలకు దూరమయ్యారు. అధికారంలో ఉంటూ కూడా ఆయన ప్రజల కోసమే పనిచేస్తున్నారు…కాకపోతే ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండటం కష్టమైపోతుంది. అదే సమయంలో మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని కాస్త ప్రజలకు దూరమయ్యారు. అందుకే జగన్ రూట్ మార్చారు….ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నేతలంతా ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు.

అదే సమయంలో జగన్ సైతం..ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు..ఓ వైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్..నిత్యం ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలపై గళం విప్పుతున్నారు. దీంతో వారు ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ఇటు జగన్ ఏమో కాస్త ప్రజలకు దూరం జరుగుతున్నట్లు కనిపించింది. అందుకే ఆ దూరాన్ని దగ్గర చేసుకోవాలని చెప్పి జగన్…ఇక నుంచి ప్రజల్లో ఉండటానికి సిద్ధమయ్యారు..ఇప్పటికే వరదాబాధితులని పరామర్శించడానికి వెళ్లడానికి డిసైడ్ అయ్యారు..అలాగే ఏ పథకం ప్రారంభమైన…అది జనం మధ్యలోకి వెళ్ళి బటన్ నొక్కడానికి ఫిక్స్ అయ్యారు.

అలాగే అధికారంలోకి వచ్చాక జగన్…పార్టీ కార్యకర్తలకు పెద్ద సమయం ఇవ్వలేదు…అసలు ఎమ్మెల్యేలకే సమయం కేటాయించలేదు…అందుకే ఇక నుంచి ఎమ్మెల్యేలని కలవడంతో పాటు..నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తల చొప్పున…అన్నీ నియోజకవర్గాల్లోన్ని కార్యకర్తలని జగన్ కలవనున్నారు. వచ్చే ఎన్నికల వరకు జగన్ ప్రజల్లో ఉండటానికే డిసైడ్ అయ్యారు. మరి ఇలా చేయడం వల్ల..కాస్త దూరమైన జనం దగ్గరవుతారేమో చూడాలి.