NTR30 లేట్ అవ్వడానికి కారణం ఆ ఇద్దరేనా..కళ్యాణ్ రామ్ అంత మాట అనేశాడు ఏంటి..?

నందమూరి నట వారసుడు తారక్ ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని చేస్తాడు అని అంటుంటారు అందరు. అది సినిమాల విషయంలో కానివ్వండి..పరసనల్ విషయాలో కానివ్వండి. తారక్ ఒక్కసారి డిసైడ్ అయితే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు, అంత కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి. ఒక్క కధను నమ్మి సైన్ చేసాడంటే..ఆ స్టోరీ ని ఎంతో నమ్మాడని అర్ధం. అయితే, రీజన్ ఏంటో తెలియదు కానీ..తారక్ నెక్స్ట్ సినిమా NTR30 పై మాత్రం జనాల్లో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కొరటాల ముందు సినిమా డిజాస్టర్ అవ్వడం.. పైగా ఆ స్టోరినీ ముందే అల్లు అర్జున్ తో కమిట్ అయ్యి..కొన్ని కారణాల చేత క్యాన్సిల్ చేసుకుని ..తారక్ తో తెరకెక్కిస్తున్నాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

పైగా..సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతున్న ఇంకా సెట్స్ పైకి వెళ్ళకపోవడం కూడా కొత్త సందేహాలు క్రియేట్ చేస్తున్నాయి. అయితే, వీటి అన్నింటికి కళ్యాణ్ రామ్ క్లారిటి ఇచ్చారు. ఆయన సినిమా బింబిసారా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. NTR30 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత NTR రేంజ్ మరింత పెరిగిందని చెప్పుకొచ్చిన ఆయన..ఈ సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయిన కారణంగా..ఆయన నుండి వచ్చే నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని చాలా గట్టిగా ప్రయత్నించారట. అందుకే కొరటాల కధను మెచ్చి నచ్చి కమిట్ అయ్యాడట.

ఇక సినిమా లేట్ అవ్వడానికి కారణాలు చెప్పుతూ..”RRR సినిమా టైంలో తారక్ అనుకున్న దానికన్న ఎక్కువ కాల్ షీట్స్ పడ్డాయి. ప్రమోషన్స్ కోసం కూడా చాలా టైం అక్కడే ఖర్చు అయిపోయింది. ఇక కొరటాల శివ కొన్ని పనుల వల్ల ఇరుకుపోయారు..దీంతో సినిమా స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది.”అంటూ పరోక్షంగా సినిమా లేట్ కి కారణం కొరటాల శివ , రాజమౌళి అని చెప్పకనే చెప్పేసారు. ఇంకా మాట్లాడుతూ..”నిర్మాతలుగా మా మీదా చాలా బాధ్యత ఉంటుంది.

అప్పుడే ఆ బాధ్యత నుంచే భయం కూడా వస్తుంది. కొంచెం తేడా వచ్చినా జరగరాని నష్టం జరిగిపోతుంది. అందుకే ప్రతి విషయాని అచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ అభిమానుల ఆతృతను అర్థం చేసుకోగలం. కానీ, ఈసారి వచ్చే అప్ డేట్స్ వాళ్లు సంతోష పడేలా ఉండాలి . ఏ అప్‌డేట్ ఇచ్చినా అథెంటిగ్గా ఉండాలని అనుకుంటున్నాం..”అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ నచ్చేలా ఉండాలని తాము భావిస్తామని కళ్యాణ్ రామ్ తెలిపాడు.