అడ్వర్టైజ్‌మెంట్లలోనూ తగ్గేదెలే అంటున్న బన్నీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ల జాబితాలో అల్లుఅర్జున్ కూడా చేరిపోయాడు. ప్రజల్లో అతనికున్న క్రేజ్‌ చూసిన చాలా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ శీతల పానీయాల సంస్థ ‘కోక్’ ఒక్క తెలుగుకే కాకుండా భారత దేశం అంతటా ప్రచాకర్తగా బన్నీని నియమించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఐకాన్ స్టార్‌గా అభిమానుల నీరాజనాలందుకుంటున్న అల్లు అర్జున్‌ను ప్రచారకర్తగా నియమించుకునేందుకు చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే శ్రీ చైతన్య, రెడ్ బస్, 7 అప్ వంటి ఎన్నో సంస్థలకు ప్రచారకర్తగా బన్నీ చేశాడు. అయితే కోకో కోలా కంపెనీకి ఏకంగా భారతదేశం అంతటా బ్రాండ్ అంబాసిడర్ కావడం అంటే మాటలు కాదు. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ వంటి ఎన్నో భాషా సినీ పరిశ్రమలలో ఎందరో స్టార్లు ఉన్నారు.

వారందరినీ కాదని ఈ కోకో కోలా యాడ్ బన్నీకి రావడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇక ఇటీవలే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి బన్నీ థాయిలాండ్ పయనమయ్యాడు. ఈ కోకోకోలా యాడ్‌కు సంబంధించిన షూటింగ్ కోసమే వారిద్దరూ విదేశాలు వెళ్లారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై అల్లు అర్జున్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Latest