నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

అక్కినేని ఫ్యామిలీ లక్కి డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గా నటించిన మూవీనే ఈ ” థాంక్యూ”. గత కొద్ది గంటల క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల దగ్గర నుండి పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంది. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా కావడంతో .. థాంక్యూ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. పైగా అక్కినేబి ఫ్యామిలీకి మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ కావడంతో..సినీ ప్రముఖులు సైతం సినిమా పై ఓ రేంజ్ లో ఊహించుకున్నారు.

కానీ, తెర పై బొమ్మ పడ్డాక అంత సీన్ లేదని అర్ధమైయ్యింది. కామన్ స్టోరీ లానే ఉంది సినిమా అంతా కూడా. నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన ఓ కుర్రాడు..అతడి పేరే అభిరామ్. ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయి.. విదేశాలల్లో ఓ బిలినియర్ గా ఎలా మారాడు..ఆ స్ధాయికి రావడానికి తన టాలెంట్ నే కారణం అనుకునే నాగ చైతన్య..ఒకానోక టైంలో అసలు విషయం గ్రహించి..తన జీవితంలో ఇంతటి పోజీషన్ కి రావడానికి కారణమైయిన వారిని వెత్తుకుంటూ వెళ్లి థాంక్యూ చెప్తాడు. అంతే నిజానికి ఇదే సినిమా పాయింట్ అంతా.. కానీ, డైరెక్టర్ తన టాలెంట్ తో..సినిమా ని లాక్కోచ్చాడు.

నిజానికి ఇది పెద్ద గొప్ప స్టోరీ లైన్ కాదు అనేది అభిమానుల భావన. నాగ చైతన్య లాంటి స్టార్ హీరోకి ఈ సినిమా సూట్ కాలేదు అంటున్నారు జనాలు. కానీ, ఈ సినిమా లో నాగ చైతన్య నటన చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ అయ్యాడు అంటున్నారు. ఇక ముగ్గురు హీరోయిన్లు కూడా..రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. కానీ, సినిమాలో హీరో కన్నా కూడా అందరికి మ్యూజిక్ నే బాగా నచ్చింది. ఎమోషన్స్ కి తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చించేశాడు తమన్.

సినిమాలో మాటకు ముందు మహేష్ బాబు పేరు వాడుకోవడం..ఆయన రిఫరెన్స్ వాడుకోవడం లానే అనిపించిన్నట్లు ఉంది తప్పిస్తే..ఎక్కడ కధకు మ్యాచ్ అవ్వలేదు. ఇంకొంత మంది నెటిజన్లు మాత్రం ఈ సినిమా థియేటర్ స్దాయి మూవీ కాదని.. ఓటీటీకి అయితే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ఆడియన్స్ టాక్ బట్టి..సినిమా యావరేక్ కూడా కాదు అని అర్ధమైపోయింది. జనాల రివ్యూ బట్టి చూస్తే సినిమా ఫ్లాపే అని చెప్పక తప్పదు. మరి చూడాలి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో..?