బ‌న్నీ హ్యాండ్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ఎస్ చెప్పిన అఖిల్‌..!

అక్కినేని హీరో అఖిల్ కెరీర్ అతుకుల బొంత‌గా మారింది. మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ రూపంలో త‌న నాలుగో సినిమాతో ఎట్ట‌కేల‌కు హిట్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత సురేద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర నిర్మాణంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్ప‌టికే రు. 70 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. వాస్త‌వంగా చెప్పాలంటే ఇది అఖిల్ మార్కెట్‌తో పోలిస్తే చాలా ఎక్కువ బ‌డ్జెట్‌. అయితే అఖిత్ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా.. సినిమా క్వాలిటీ కోసం రాజీడ‌ప‌కుండా చూడ‌మ‌న్నాడ‌ని అంటున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ లో ఉండ‌గా.. అఖిల్ నెక్ట్స్ సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. నిర్మాత దిల్ రాజు కు అఖిల్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఆస్ధాన దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథకు అఖిల్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ గ‌త యేడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన రీమేక్ మూవీ వ‌కీల్ సాబ్‌ను డైరెక్ట్ చేశాడు. అప్ప‌టి నుంచి వేణు ఖాళీగానే ఉన్నాడు.

వేణు శ్రీరామ్ ఎప్పటి నుంచో సినిమా కోసం వెయిటింగ్‌లోనే ఉన్నాడు. వేణు వ‌కీల్‌సాబ్ కంటే ముందుగానే బన్నీ హీరోగా ఐకాన్ సినిమా చేయాలని అలా వేచి వున్నాడు. అయితే ఇక ఈ సినిమా రాదు అన్న క్లారిటీ వేణుకు వ‌చ్చేసింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే వేరే కథను అఖిల్ కు చెప్ప‌గా అఖిల్ ఓకే చెప్పాడ‌ట‌. ఏజెంట్ సినిమా తరువాత ఆ సినిమా స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది.

అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో చేయడం అఖిల్ కు ఇదే తొలిసారి. నిజానికి వేణు శ్రీరామ్ వేరే బ్యానర్ లో సినిమా చేయాల్సి వుంది. కానీ దానికి హీరో ఇంకా ఫైనల్ కాక‌పోవ‌డంతో ముందుగా అఖిల్ ప్రాజెక్ట్ టేకాఫ్ చేస్తున్నాడు.

Share post:

Latest