పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించిన “మేజర్”.. సరికొత్త రికార్డ్..!!

కంటెంట్ ఉండాలేకాని ఎలాంటి హీరో సినిమాను అయిన జనాలు ఆదరిస్తారు అని ప్రజలు మరోసారి ప్రూవ్ చేశారు. ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే..బడా బడా హీరోల సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టాయి. కానీ, ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా..రియల్ కధతో వచ్చిన “మేజర్” సినిమా మాత్రం..అన్ లిమిటెడ్ రికార్డ్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ‘మేజర్‌’ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.

మల్టీ టాలెంటెడ్ అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ సినిమాకి దర్శకుడిగా పని చేశాడు..శశి కిరణ్‌ తిక్క. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు, ఇప్పటి వరకు అడివి శేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా “మేజర్” రికార్డ్ సృష్టించింది. అంతేనా..రీసెంట్ గా ఓటీటీలో కూడా రిలీజై..బిగ్ సినిమా రికార్డలను తిరగరాస్తుంది.

సరిగ్గ సినిమా రిలీజైన నెల రోజుల తరువాత అంటే జులై 3 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సినిమాను ధియేటర్లలో చూసిన జనాలు కూడా మళ్ళీ మళ్ళీ ఈ సినిమా సినిమాను ఓటీటీలో చూస్తూ .. సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ కు హ్యాట్ సాఫ్ చెప్పుతున్నారు. ధియేటర్స్ లోనే కాదు ప్రేక్షకులు ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా “మేజర్” సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిష‌న్ల‌లో కొన‌సాగుతుంది. పాన్ ఇండియా మూవీ RRR ను వెనక్కి నెట్టి..బాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిన భూల్ భూలియా సినిమాను సైతం వెనక్కి నెట్టి..‘మేజర్‌’ సినిమా టాప్ లో నిలిచింది. హిందీ వెర్షన్‌ టాప్‌ 1లో ట్రెండ్‌ అవుతుండగా, తెలుగు వెర్షన్‌ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌లో కూడా ‘మేజర్‌’ సినిమా టాప్ ప్లేస్ దక్కించుకుంది . అక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్‌ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్‌ 1లో ఉండడం గమనార్షం.