టీడీపీలో 17 సీట్లు ఫిక్స్..అవే డౌట్?

ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది…కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ…ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఫిక్స్ చేసే పనిలో రెండు పార్టీలు ఉన్నాయి.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సీట్లు ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే..అటు వైసీపీలో కూడా కొన్ని సీట్లు ఫిక్స్ అవుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీలోని సిటింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఫిక్స్ అయ్యాయని, పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. దాదాపు అందరూ సిటింగ్ లకు మళ్ళీ సీట్లు ఫిక్స్ అని తెలుస్తోంది. అయితే రెండు సీట్లలో మాత్రం క్లారిటీ రావడం లేదని సమాచారం.

గత ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే…అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు..దీంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు…ఇక ఇందులో 17 సీట్లు దాదాపు ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. ఎలాగో చంద్రబాబు..కుప్పంలో, బాలయ్య..హిందూపురంలో పోటీ చేయడం ఖాయం. ఇక పయ్యావుల కేశవ్-ఉరవకొండ, డోలా బాలవీరాంజనేయస్వామి­-కొండపి, గొట్టిపాటి రవికుమార్-అద్దంకి, ఏలూరి సాంబశివరావు-పర్చూరు, అనగాని సత్యప్రసాద్-రేపల్లె, గద్దె రామ్మోహన్-విజయవాడ తూర్పు, నిమ్మల రామానాయుడు-పాలకొల్లులో పోటీ చేయడం ఖాయమే.

 

అయితే ఉండి సీటులో క్లారిటీ లేదు…ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు ఉన్నారు…వచ్చే ఎన్నికల్లో ఈ సీటు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు దక్కే ఛాన్స్ ఉంది. గతంలో శివ..రెండుసార్లు ఉండి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్-రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్-బుచ్చయ్య చౌదరీ, జోగేశ్వరరావు-మండపేట, చినరాజప్ప-పెద్దాపురం, వెలగపూడి రామకృష్ణ-విశాఖ తూర్పు, గణబాబు-విశాఖ పశ్చిమ, అచ్చెన్నాయుడు-టెక్కలి, అశోక్-ఇచ్చాపురం లో పోటీ చేస్తారు.

ఇక విశాఖ ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేసేది కష్టమే..అసలు ఆయన  ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. మొత్తానికైతే రెండు సీట్లు మినహా..మిగిలిన సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు.