విక్ర‌మ్ సినిమాకు క‌మ‌ల్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌…!

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “విక్రమ్”. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌నల్ ఫిలింస్ బ్యానర్‌పై క‌మ‌ల్ స్వ‌యంగా ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తుండగా, హీరో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో క‌మ‌ల్ సినిమా అయితే థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో నటీనటులకు ఎంతమేర పారితోషికం ఇచ్చారన్న విషయం ఇప్పుడు ఇటు సినిమా, మీడియా వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మ‌రింది. ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ఈ సినిమా బడ్జెట్‌ రూ.120 కోట్ల పైనే ఉంద‌ట‌.

ఇక ఈ సినిమా యూనిట్ రెమ్యున‌రేష‌న్ కూడా హై స్థాయిలో ఉంద‌ని తెలుస్తోంది. క‌మ‌ల్ ఈ సినిమాకు రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకోనున్నాడ‌ట‌. ఇక లాభాలు వ‌చ్చినా ఆయ‌న‌కే ద‌క్కుతాయి. ఇక ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్‌ దాదాపు రూ.8 కోట్లు అందుకున్నట్లు టాక్‌. మ‌రో హీరో విజయ్‌ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌కు రూ.4 కోట్లు, సంగీత దర్శకుడిగా వ్యవహరించిన అనిరుధ్‌ రవిచందర్‌కు కూడా రూ.4 కోట్లు ముట్టజెప్పారట.

Share post:

Popular