ఫ్లోలో టంగ్ స్లిప్ అయిన డైరెక్టర్..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్..!!

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు..బడా బడా స్టార్స్ ఉన్నా..కానీ, నవ్వించే డైరెక్టర్లు అన్నా..స్టార్స్ అన్నా..జనలకి మహా ఇష్టం. అస్సలు సినిమాకి వెళ్లేదే నవ్వుకోవడం కోసం. ఇలా జనాలని కడుపుబ్బ నవ్వించే లిస్ట్ లో డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు కమర్షీయల్ సినిమా అంటూ లాభాలు తెచ్చుకునే విధంగా సినిమాలు తీస్తున్నారు తప్పిస్తే..ఎవ్వరు జనాల ను మైండ్ లో పెట్టుకుని మూవీ చిత్రీకరించడం లేదు .

కానీ, మారుతి తన ఫస్ట్ సినిమా మొదలు..మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న “పక్క కమర్షియల్” సినిమా వరకు..ప్రతి సినిమాలో జనాలను నవ్వించడమే మెయిన్ ధీమ్ గా పెట్టుకున్నారు. గోపీచంద్ ,రాశీ ఖన్నా లతో “పక్క కమర్షీయల్” అనే సినిమా ను తెరకెక్కించిన ఈయన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే డార్లింగ్ తో సినిమా పై సగం మ్యాటర్ లీక్ చేసేశాడు.

ఇంటర్వ్యుల్లో యాంకర్ నుండి ప్రభాస్ సినిమా ప్రశ్న ఎదురవగ్గా..ఆయన మాట్లాడుతూ..” ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ ని ప్రభాస్ కి వినిపించాను. మాటలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభాస్ కి మర్చిపోలేని హిట్ ఇస్తా..నేను మరో డార్లింగ్, బుజ్జిగాడిని చూయించాలి అనుకుంటున్నాను జనాలకి. నేను ప్రభాస్ కు బిగ్ ఫ్యాన్ ను . ఆయన అభిమానులను డిస్పాయింట్ చేయను. ప్రభాస్ నుంచి ఆడియన్స్‌ ఏం కోరుకుంటున్నారో అదే చూపిస్తా. ఆయన రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది..’ అంటూ మారుతి ప్రభాస్ మూవీ గురించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరిన్ని డీటైల్స్ ఇవ్వాలంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.

Share post:

Popular