షాకింగ్‌: రాజ‌కీయాల‌కు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!

ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ర‌గులుతున్నారు. వీరి బాధ‌లు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్ర‌మే త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్నా త‌మ‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని… పైగా స‌జ్జ‌ల లాంటి వాళ్లే పైన చ‌క్రాలు తిప్పేస్తూ ఉండ‌డంతో రాజ‌కీయంగా ద‌శాబ్దాల నుంచి త‌మ‌కు ఎంత అనుభ‌వం ఉన్నా ఉపయోగం లేద‌ని వారు వాపోతున్నారు.

పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది వ‌ర‌కు ఉన్నారు. ఈ లెక్క‌న మంత్రి వ‌ర్గంలో చోటు కోసం చాలా మంది రెడ్డి ఎమ్మెల్యేలు ట్రై చేశారు. అయితే జ‌గ‌న్ కేవ‌లం 4 గురు రెడ్డి ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే కేబినెట్లో చోటు క‌ల్పించారు. పైగా పెద్దిరెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిని మ‌రోసారి కంటిన్యూ చేశారు. దీంతో కొత్త‌గా రోజా రెడ్డి, కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి కి మాత్ర‌మే చోటు ద‌క్కింది.

అస‌లు అనంత వెంక‌ట్రామిరెడ్డి – మ‌హీధ‌ర్ రెడ్డి – ఆనం రెడ్డి – శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి ఇలా మంది రెడ్డి సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు ఛాన్సులు లేక‌పోవ‌డంతో వారిలో చాలా మంది ర‌గిలిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒళ్లు గుళ్ల చేసుకుని మ‌ళ్లీ గెలిచినా త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు ఉండ‌వ‌ని వాళ్లు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రి ప‌ద‌వులు పోయిన వారికే మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు.

దీంతో ఈ రాజ‌కీయాలు చేయ‌లేక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేయాల‌ని కొంద‌రు రెడ్డి ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యార‌ట‌. ఈ లిస్టులో మాజీ మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి – మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి – ఇక శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ని వారు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆనం పార్టీ మారిపోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌హీధ‌ర్ రెడ్డి చివ‌రి వ‌ర‌కు చెప్ప‌లేం. ఆయ‌న పార్టీ మార‌తారా ? పోటీకి దూరంగా ఉంటారా ? అన్న‌ది చూడాలి. ఇక శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి మాత్రం తాను రాజ‌కీయాల‌కు త‌ప్పుకుని త‌న త‌న‌యుడు కార్తీక్ రెడ్డికి సీటు ఇప్పించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి ఈ లిస్టులో మ‌రి కొంత మంది రెడ్డి ఎమ్మెల్యేల పేర్లు కూడా వ‌స్తాయ‌ని అంటున్నారు.

Share post:

Latest