ఆ ఒక్క మాటతో జనాల చేత ఛీ కొట్టించుకుంటున్న KGF హీరోయిన్ ..!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అందరూ..ఓ ఫార్ములా ని బాగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. సినిమాలో అవకాశాలు వచ్చే వరకు సాఫ్ట్ గా ఉంటూ పనులు కానిచ్చేస్తున్నారు. వన్స్ సినిమా హిట్ అయితే..నిర్మాతలకు చుక్కలు చూయిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ, రోజుకో బ్యూటీ హాట్ అందాలతో తెరపై అందాల వల వేస్తూ కుర్రాళ్లను బంధించేస్తున్నారు. ఒకటి, రెండు సినిమా లు హిట్ పడగానే రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచుతూ…నిర్మాతలకి పట్ట పగలే చుక్కలు చూయిస్తున్నారు.

ఇప్పటికే కుర్ర బ్యూటీలు కృతిశెట్టి, శ్రీలీల సినిమాకి కోటి డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజా గా ఈ లిస్ట్ లోకి యాడ్ అయ్యింది..పాన్ ఇండియా స్దాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి. అంతకముందు వరకు ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ, KGF సిరీస్ తో తన పేరును మారు మ్రోగిపోయేలా చేసుకుంది ఈ బ్యూటి. KGF2 లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి..ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నిధి యాక్టింగ్ స్కిల్స్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక మిగతా హీరోలు, స్టార్స్ కూడా..ఆమెను దేవకన్యలా చూస్తూ వచ్చారు. దీంతో అమ్మడు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని డిసైడ్ అయ్యింది. తన దగ్గరకి వచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు కొత్త రెమ్యూనరేషన్ లెక్కలు చెప్పి చుక్కలు చూయిస్తుందట. అమ్మడు డిజిట్స్ విని నిర్మాతలు మైండ్ బ్లాక్ అవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న శ్రినిధి కి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. యాంకర్ అడుగుతూ..”మీకు డబ్బు కావాలా..పేరు కావాలా”అంటూ అడిగారు..వెంటనే అమ్మడు..”నాకు డబ్బే ముఖ్యం”..అంటూ కుండబద్ధలు కొట్టిన్నట్లు చెప్పేసింది. దీంతో అమ్మడు పై వస్తున్న వార్తలు నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే ఇంత తలపొగరా..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Popular